గ్లోబల్ లీడర్ షిప్ అందుకున్న పిచాయ్...!!!

అమెరికాలో భారతీయుడు మరో సారి సగర్వంగా తలెత్తుకుని తిరిగే ఘటన చోటు చేసుకుంది.అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ లీడర్ షిప్ అవార్డ్ భారతీయుడైన సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ని వరించింది.

 Global Leadership Award Winner Is Ceo Sundar Pichai-TeluguStop.com

ఈ అవార్డ్ రావడం అంటే అంత సులభం కాదని, అలాంటి అవార్డు భారతీయుడిని వరించడం ఎంతో సంతోషంగా ఉందని భారత సంతతి వ్యక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గ్లోబల్ లీడర్ షిప్ అందుకున్న

అమెరికా –భారత వ్యాపార మండలి ప్రతీ ఏటా ఇచ్చే ఈ అవార్డ్ కి 2019 సంవత్సరానికి గాను సుదర్ పిచాయ్ తో పాటుగా ,నాస్‌డాక్‌ ప్రెసిడెంట్‌ అడెన ఫ్రీడ్‌మాన్‌ కూడా ఎంపిక అయ్యారు.వచ్చే వారం జరిగే భారత ఐడియా సదస్సు లో ఈ అవార్డ్ లు ప్రధానం చేస్తారు.భారత్ లో ఎంతో మంది యువతీ యువకులకి ఆదర్శంగా నిలిచిన సుందర్ పిచాయ్ కి ఈ గుర్తింపు రావడం భారత యువతలో మరింత పట్టుదల నింపుతుందని నుపుణులు అంటున్నారు.

భారత-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య సంభందాలకి దోహదం చేసే రెండు దేశాల అగ్రశ్రేణి కంపెనీల ఉన్నత అధికారులకి “యూఎస్‌ఐబీసీ” 2007 నుంచీ ప్రతీ ఏటా ఈ అవార్డులని ప్రధానం చేస్తోంది.ప్రజల యొక్క జీవితాల్ని మెరుగు పరచడంలో టెక్నాలజీ ప్రభావం ఏమిటో భారత్‌లో పుట్టి పెరిగిన నాకు బాగా తెలుసునని, ఈ అభివృద్ధిలో గూగుల్ పాత్ర ఎంతో కీలకమని పిచాయ్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube