అమెరికా: అంతర్జాతీయ కన్సల్టెన్సీ దిగ్గజం ‘‘జడ్ఎస్’’కి సీఈవోగా భారతీయుడు

గ్లోబల్ కన్సల్టింగ్, టెక్నాలజీ దిగ్గజం జడ్ఎస్‌ కొత్త సీఈవోగా భారత సంతతికి చెందిన ప్రతాప్ ఖేడేకర్ నియమితులయ్యారు.కన్సల్టేషన్ విభాగంలో ఆయనకు రెండు దశాబ్ధాల అనుభవం వుంది.

 Global Consulting Firm Zs Appoints Pratap Khedkar As Ceo-TeluguStop.com

ప్రస్తుతం ఆయన జడ్ఎస్ గ్లోబల్ బయోఫార్మాసూటికల్స్, హెల్త్‌కేర్ ప్రాక్టీస్‌ విభాగాలకు అధిపతిగా వ్యవహరిస్తున్నారు.దీనికి పూర్వం డేటా సైన్స్ గ్రూప్‌లో పలు కీలక విభాగాల్లో ప్రతాప్ పనిచేశారు.

ప్రతాప్ ఖేడేకర్ కాలిఫోర్నియా, బర్క్‌లీ విశ్వవిద్యాలయం నుంచి కృత్రిమ మేథస్సులో పీహెచ్‌డీ చేశారు.అలాగే ఢిల్లీలోని ప్రఖ్యాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీని పొందారు.2012 నుంచి జడ్ఎస్ బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్న ఆయన మల్టీఛానెల్ మార్కెటింగ్, మార్కెటింగ్ మిక్స్, సేల్స్ ఫోర్స్ స్ట్రాటజీ, ప్రోత్సాహకాలపై ఏఐని ఉపయోగించారు.తద్వారా మార్కెట్ యాక్సెస్, మేనేజ్డ్ కేర్ సహా విస్తృత స్థాయి అమ్మకాలు, మార్కెటింగ్ సమస్యలపై ఫార్మాస్యూటికల్, హెల్త్ కేర్ పరిశ్రమల్లోని అనేక కంపెనీలకు ప్రతాప్ కన్సల్టెంగ్ సేవలు ఇచ్చారు.ఇటీవల హెల్త్ కేర్ క్లయింట్ల కోసం సమర్థవంతమైన వ్యూహాలు, విశ్లేషణలపై ఆయన దృష్టి పెట్టారు.

 Global Consulting Firm Zs Appoints Pratap Khedkar As Ceo-అమెరికా: అంతర్జాతీయ కన్సల్టెన్సీ దిగ్గజం ‘‘జడ్ఎస్’’కి సీఈవోగా భారతీయుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

40 సంవత్సరాల జడ్ఎస్ చరిత్రలో ప్రతాప్ ఖేడేకర్ ఆ సంస్థకు మూడవ సీఈవో.గతంలో జడ్ఎస్ వ్యవస్థాపకులు ఆండ్రిస్ జోల్ట్‌నర్స్, ప్రభాకాంత్ సిన్హా (వీరిద్దరూ మసాచుసెట్స్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ క్లాస్ మేట్స్) నడిపించారు.ఆ తర్వాత క్రిస్‌రైట్ కంపెనీకి సారథ్యం వహించారు.

1989లో రైట్ ఈ సంస్థలో చేరినప్పుడు.జడ్ ఎస్ కేవలం 50 మంది సిబ్బందితో, అప్పటికీ ఐదేళ్లను పూర్తి చేసుకుంది.

ఆయన సారథ్యంలో జడ్ఎస్‌ వృద్ధి సాధించింది.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 28 కార్యాలయాల నుంచి 9000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

కోవిడ్ మహమ్మారి కాలంలోనూ జడ్ ఎస్ 30 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం.

Telugu Andris Zolteners, Ceo, Chris Right Ceo, Global Consulting Firm Zs Appoints Pratap Khedkar As Ceo, Healthcare Practice, Juds Global Biopharmaceuticals, Prabhakant Sinha, Pratap Khedekar, University Of Berkeley-Telugu NRI

ప్రతాప్ ఖేడేకర్ నియామకంపై రైట్ స్పందిస్తూ.ఆయన జడ్‌ఎస్ అభివృద్ధితో పాటు ఉత్తేజకరమైన మార్పు తీసుకొస్తారని ఆకాంక్షించారు.ప్రతాప్ మార్గదర్శకత్వంలో జడ్ఎస్‌కు రానున్న కాలంలో మంచి రోజులు వస్తాయని రైట్ అన్నారు.

కాగా, సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ ప్రిన్సిపల్ ఎమిరిటస్‌గా ఐదేళ్ల పాటు జడ్ఎస్‌కు రైట్ సేవలందిస్తారు.

మరోవైపు తన నియామకంపై ప్రతాప్ ఖేడకర్ స్పందించారు.

క్రిస్ రైట్ సీఈవోగా వున్న సమయంలో అద్భుతాలు చేశారని కొనియాడారు.రాబోయే నెలలు, సంవత్సరాలలో తాను అతని అనుభవం, మార్గదర్శకత్వంపై ఆధారపడతానని ఖేడేకర్ తెలిపారు.

#Pratap Khedekar #Chris Right CEO #JudsGlobal #UniversityOf

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు