గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డ్ గెలుచుకున్న ప్రవాస బాలిక..!!!!

ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలలో ప్రతిభాపాటవాలు చూపించే పిల్లలకి ప్రతీ ఏడాది గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డ్ పేరిట ప్రత్యేక పురస్కారాలు ఇవ్వడం అనవాయితాగా జరుగుతోంది.ఈ అవార్డులని స్పాన్సర్ చేసేది, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తో పాటు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ , ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ లు.

 Global Child Prodigy Award Suchetha Satish-TeluguStop.com

అయితే ఈ అవార్డ్ ని సింగింగ్ విభాగంలో గెలుచుకున్నది ఓ ప్రవాస భారత బాలిక

దుబాయ్ లో ఉండే ఈ బాలిక పేరు సుచేత సతీష్ బాలిక వయసు 13 సంవసత్సరాలు.ఇంతకీ ఆమెని ఎంపిక చేయడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే.

ఆమె ఒకే కచేరీలో 120 బాషలలో గానం చేస్తుందట.ఈ మేరకు ఆమె అదే సభలో గానం చేసేసరికి ఫిదా అయినా ఎంపిక కమిటీ ఆ బాలికని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.

పురస్కారం అందుకున్న సుచేత మాట్లాడుతూ ఈ పురస్కారం అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది.తానూ సింగింగ్ లో తాను రెండు ప్రపంచ రికార్డ్ లు క్రియేట్ చేశానని తెలిపింది.

Telugu Dubai Indian, Childprodigy, Suchetha Satish, Telugu Nri Ups-

ఇదిలాఉంటే 120 బాషలలో కచేరి చేయడం ఒకెత్తయితే రెండేళ్ళ క్రితం 12 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియంలో 102 బాషలలో ఏకధాటిగా 6.15 గంటలు గానం చేయడం మరొక రికార్డని తెలిపింది.అయితే ఈ అవార్డుల ప్రదానానికి నోబెల్ అవార్డ్ గ్రహీత సత్యార్ది రానున్నట్టుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube