ఆస్ట్రేలియా క్రికెటర్స్ ఎక్కువగా ఇండియా సంప్రదాయాలు, ఇక్కడి కల్చర్ కి ఎక్కువగా ఇష్టపడతారు.అలాగే ఇండియా అమ్మాయిల మీద కూడా మనసు పారేసుకుంటారు.
ఇప్పుడు ప్రేమకి సరిహద్దులు చెరిగిపోయాయి అనే విషయం అందరికి తెలిసిందే.ఇప్పటికే మన తెలుగు అందాల భామలు, హీరోయిన్స్ విదేశీయులతో ప్రేమకథలు నడపడం, అక్కడి వారిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవడం చేస్తున్నారు.
ఇక విదేశీ క్రికెటర్లు సైతం ఇండియన్ అమ్మాయిలని పెళ్లి చేసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి.ఇప్పుడు వారి దారిలోనే మరో ఆస్ట్రేలియా క్రికెటర్ కూడా చేరిపోయాడు.
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్, డాషింగ్ బ్యాట్స్ మెన్ గ్లెన్ మాక్స్వెల్ తన ప్రేయసి, భారత సంతతికి చెందిన వినీ రామన్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు.పూర్తిగా భారతీయ సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుక జరగడం విశేషం.
వేదమంత్రోచ్చారణల మధ్య ఇరువురూ దండలు మార్చుకున్న ఫొటోలను వినీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.మాక్స్ వెల్ హిందూ సంప్రదాయాలని గౌరవిస్తూ అక్కడ హిందూ ఆలయాలకి కూడా వెళ్తూ ఉంటాడు.
ఈ నేపధ్యంలోనే ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన భారత సంతతి అమ్మాయిని ప్రేమించడం, ఆమెతో ఏడు అడుగులు నడిచేందుకు రెడీ అవడం జరిగిపోతుంది.