ఇండియా అమ్మాయితో నిశ్చితార్ధం చేసుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్

ఆస్ట్రేలియా క్రికెటర్స్ ఎక్కువగా ఇండియా సంప్రదాయాలు, ఇక్కడి కల్చర్ కి ఎక్కువగా ఇష్టపడతారు.అలాగే ఇండియా అమ్మాయిల మీద కూడా మనసు పారేసుకుంటారు.

 Glenn Maxwell Announces Engagement To Indian Origin-TeluguStop.com

ఇప్పుడు ప్రేమకి సరిహద్దులు చెరిగిపోయాయి అనే విషయం అందరికి తెలిసిందే.ఇప్పటికే మన తెలుగు అందాల భామలు, హీరోయిన్స్ విదేశీయులతో ప్రేమకథలు నడపడం, అక్కడి వారిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవడం చేస్తున్నారు.

ఇక విదేశీ క్రికెటర్లు సైతం ఇండియన్ అమ్మాయిలని పెళ్లి చేసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి.ఇప్పుడు వారి దారిలోనే మరో ఆస్ట్రేలియా క్రికెటర్ కూడా చేరిపోయాడు.

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌, డాషింగ్ బ్యాట్స్ మెన్ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ తన ప్రేయసి, భారత సంతతికి చెందిన వినీ రామన్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు.పూర్తిగా భారతీయ సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుక జరగడం విశేషం.

వేదమంత్రోచ్చారణల మధ్య ఇరువురూ దండలు మార్చుకున్న ఫొటోలను వినీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.మాక్స్ వెల్ హిందూ సంప్రదాయాలని గౌరవిస్తూ అక్కడ హిందూ ఆలయాలకి కూడా వెళ్తూ ఉంటాడు.

ఈ నేపధ్యంలోనే ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన భారత సంతతి అమ్మాయిని ప్రేమించడం, ఆమెతో ఏడు అడుగులు నడిచేందుకు రెడీ అవడం జరిగిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube