సర్వే రిపోర్ట్‌ : భారతీయ మహిళలు పైకి కనిపించరు కాని లోపల ఆ కోరికలు చాలా ఎక్కువ గురూ  

Gleeden App Survey Report Indian Woman Wants More-gleeden App Survey,indian Woman,telugu Viral News Updates,viral In Social Media

ఇండియన్స్‌ పాటించిన సాంప్రదాయాలు ప్రపంచంలో ఎక్కడ కూడా పాటించరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారతీయ స్త్రీలను దేవతలుగా పూజిస్తారు. వారిని ప్రతి ఒక్కరు కూడా ఎంతో గౌరవిస్తారు..

సర్వే రిపోర్ట్‌ : భారతీయ మహిళలు పైకి కనిపించరు కాని లోపల ఆ కోరికలు చాలా ఎక్కువ గురూ-Gleeden App Survey Report Indian Woman Wants More

అలాంటి భారతీయ స్త్రీలు శృంగారం విషయంలో ఒకప్పుడు అస్సలు ఓపెన్‌ అయ్యేవారు కాదు. శృంగారం అనేది ఒక రహస్యంగా మాత్రమే భావించే వారు. భాగస్వామితో తప్ప పర పురుషుడితో శృంగారం అనేది ఇండియాలో నేరంగా పరిగణిస్తారు.

కాని ఇండియాలో అక్రమ సంబంధాలు ఈమద్య కాలంలో చాలా ఎక్కువ అవుతున్నాయి. అక్రమ సంబంధాలకు కారణం ఆడవారి కోరికలే అని తాజాగా ఒక సర్వేలో వెళ్లడయ్యింది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళల శృంగార కోర్కెలు మరియు వారి జీవిత భాగస్వామ్యులతో పొందుతున్న సుఖం ఇంకా ఇతరత్ర విషయాల గురించి ప్రముఖ గ్లీడెన్‌ అనే యాప్‌ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ యాప్‌ ద్వారా మహిళలు తమకు నచ్చిన అబ్బాయితో చాట్‌ చేసుకోవచ్చు.

ఆమె తన వివరాలను పూర్తిగా ఇవ్వకుండానే అవతలి వ్యక్తి గురించి తెలుసుకుని ఛాటింగ్‌ చేసి నచ్చితే డేటింగ్‌ కూడా చేసుకోవచ్చు. ఆడవారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ యాప్‌ విదేశాల్లో చాలా ఫేమస్‌. ఇండియాలో మెట్రోనగరాల్లో కూడా దీని వినియోగం చాలా ఎక్కువగా ఉంది..

ఈ యాప్‌ సర్వేలోనే ఆశ్చర్యకర విషయాలు వెళ్లడయ్యాయి.

పలు కారణాల వల్ల మహిళలు పెళ్లి అయిన తర్వాత కూడా అక్రమ సంబంధం పెట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సర్వేలో పాల్గొన్న ఆడవారిలో 70 శాతం మంది మహిళలు అక్రమ సంబంధంపై మోజు ఉందని పేర్కొన్నారు. అయితే ఇండియా విషయానికి వస్తే ఇక్కడి ఆడవారు ఏకంగా 82.5 శాతం మంది అక్రమ సంబంధాలపై ఆసక్తిగా ఉందన్నారు. తమ వివరాలు తెలియవు కనుక ఈ సర్వేలో పాల్గొనేందుకు ఇండియన్‌ మహిళలు ఒప్పుకున్నారు.

అక్రమ సంబంధాల కోసం వీరు రకరకాల కారణాలు అయితే చెప్పారు. అక్రమ సబంధాలపై ఆసక్తి అయితే ఉంది కాని, తాము అలాంటి పని మాత్రం చేయలేమని కొందరు అంటున్నారు.

మొత్తానికి ఇండియన్‌ మహిళలు పైకి హుందాగా కనిపించినా కూడా కొందరు మాత్రం ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారా అంటూ ఈ సర్వే ద్వారా ఆశ్చర్యం కలుగుతోంది. అయితే ఇది మెట్రో నగరాలకు చెందిన మహిళల విషయంలో మాత్రమే జరిగిన సర్వేగా గుర్తించాలి.