కొడుకు తో విహారయాత్రకు వెళ్లి మిస్ అయిన నటి!  

Glee star Naya rivera missing reported after boat ride, Glee, Glee Star Rivera, Boat Ride, Joshi Ni, Riyana Dorse - Telugu Boat Ride, Glee, Glee Star Rivera, Joshi Ni, Riyana Dorse

అమెరికన్ పాపులర్ మ్యూజికల్ కామెడీ షో ‘గ్లీ’ (glee) స్టార్ నయా రివెరా కాలిఫోర్నియాలోని నదిలో విహారానికి అని కొడుకు తో కలిసి వెళ్లింది.బుధవారం మధ్యాహ్నం నదిలో విహారయాత్రకు వెళ్లిన నటి ఆచూకీ ఇప్పటికి తెలియడం లేదు.

 Glee Star Naya Rivera Missing Boat Ride

రివెరా తన కుమారుడు జొసీ ని వెంటబెట్టుకొని బుధవారం విహార యాత్ర కు వెళ్ళింది.ఆ రోజు మధ్యాహ్నం ఒంటిగంట ఆ సమయంలో ఒక బోటు అద్దెకు తీసుకొని కొడుకు తో కలిసి బోటు లో షికారు కు వెళ్ళింది.

అయితే ఆ తరువాత మూడు గంటల సమయంలో నటి కుమారుడు జొసీ మాత్రమే లైఫ్ జాకెట్ వేసుకొని నదిలో కనిపించగా ఒక బొటర్ రక్షించినట్లు తెలుస్తుంది.

కొడుకు తో విహారయాత్రకు వెళ్లి మిస్ అయిన నటి-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే కేవలం చిన్నారి జాడ మాత్రమే తెలియగా నటి రివెరా జాడ మాత్రం ఇప్పటివరకు తెలియలేదు.

దీనితో విషయం తెలుసుకున్న అధికారులు ప్రస్తుతం న‌టి ఆచూకి కోసం హెలికాప్టర్లు, డ్రోన్లసాయంతో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు అధికారులు. హిట్ టీవీ మ్యూజికల్ డ్రామా “గ్లీ” లో సంతాన లోపెజ్ పాత్రలో నటించి రివెరా మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

ఈ షో అక్కడ ఆరు సంవత్సరాలు ప్రసారం అయ్యింది.నటుడు రియాన్ డోర్సే ను వివాహం చేసుకున్న ఆమె 2018లో విడాకులు తీసుకోవడం తో ప్రస్తుతం తన కుమారుడితోనే ఒంటరిగా ఉంటుంది.

అయితే చివరి సారిగా కూడా ఆమె తన కొడుకుతో దిగిన ఓ ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ మీ ఇద్దరమే అంటూ.పోస్ట్ కూడా చేసింది.

ఆ తరువాత నుంచే ఆమె జాడ తెలియరాలేదు.

దీనితో ఆమె నదిలో ఏదైనా ప్రమాదానికి గురై మృతి చెంది ఉంటుంది అని అధికారులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటివరకు ఎలాంటి జాడ తెలియరాలేదు.రాసుకుంది.

అయితే ఈ వార్త తెలుసుకున్న ఆమె అభిమానులు, నెటిజన్స్ మాత్రం ఆమె ట్విట్టర్ వాల్‌పై ఆమె సురక్షితంగా తిరిగిరావాలంటూ కోరుకుంటున్నారు.

#Glee #Joshi Ni #Riyana Dorse #Boat Ride

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Glee Star Naya Rivera Missing Boat Ride Related Telugu News,Photos/Pics,Images..