బంతి మిగిల్చిన భారీ నష్టం..అమెరికాలో షాకింగ్ ఘటన...!!!

కొన్ని కొన్ని సంఘటనలు ఊహలకు అందని విధంగా జరుగుతుంటాయి.చిన్న చిన్న వస్తువులు అనుకునేవే రేపటి రోజున మనకు భారీ నష్టాన్ని తెచ్చి పెట్టె పరిస్థితి కూడా రావచ్చు.

 Crystal Ball Sparks Wisconsin House Fire, Delton, Crystal Ball , House Fire, Gla-TeluguStop.com

అమెరికాలో ఓ వ్యక్తికీ ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది.ఒక చిన్న బంతిని ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్న పాపానికి ఇప్పుడా వ్యక్తీ దాదాపు రూ.2 కోట్ల నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది.ఇంతకీ అసల ఏం జరిగిందంటే.

అమెరికాలోని విస్కాన్సిస్ లోని డెల్టాన్ టౌన్ లో ఉన్న ఫాక్స్ హిల్స్ రోడ్డు లో ఉన్న ఇంట్లో ఒక్క సారిగా మంటలు ఎగసి పడుతున్నాయి.ఈ ఘటన చూసిన స్థానికులు అగ్ని మాపక అధికారులకు సమాచారం అందించారు.

కాగా అదే సమయంలో ఇంటి యజమాని వస్తూ పరిస్థితిని చూసి షాక్ అయ్యాడు.ఘటనా స్థలానికి వచ్చిన సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

కానీ ఈలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఇంటిలో విలువైన సామాన్లు, వస్తువులు అన్నీ కాలి బూడిద అయ్యిపోయాయి.

దాదాపు రూ. 2.50 కోట్ల మేరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Telugu Delton, Glass, Sun Rays-Telugu NRI

ఇదిలాఉంటే అసలు ఇంట్లో మంటలు ఎలా వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు చేశారు అధికారులు.ముందు షార్ట్ సర్క్యూట్ వలన మంటలు చెలరేగాయని అనుకున్నారు.కానీ అలాంటి ఆధారాలు ఎక్కడా దొరకలేదు.

దాంతో ఏ పరిస్థితులు కారణం అయ్యి ఉంటాయోనని సోధిస్తున్న అధికారులకు ఓ గాజు బంతి కనపడింది.ఇదే ప్రమాదానికి అసలు కారణమని గుర్తించారు.

ఎలాగంటే.యజమాని ఈ గాజు బంతిని తన బెడ్ రూమ్ లో ఉంచాడు.

అది సూర్య కిరణాలు పడే ప్రాంతంలో ఉంది.అయితే సూర్య కిరణాలు బంతిపై పడి అవి పరావర్తనం చెంది నేరుగా బెడ్ పై పడటంతో మంటలు చెలరేగి ఇల్లు మొత్తం అంటుకుంది.

ఈ విషయం తెలుసుకున్న యజమాని లబో దిబో మంతున్నాడు.రెండు రోజుల క్రితం కిరణాలు పడని ప్రాంతంలో ఉన్న బంతిని ఇక్కడ పెట్టానని ఇలా జరుగుతుందని అనుకోలేదని బోరుమంటున్నాడు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube