మహిళలు కత్తులను దగ్గర పెట్టుకోవాలి అన్న యూపీ మంత్రి

ఇటీవల యూపీ లో చోటుచేసుకుంటున్న వరుస అత్యాచార ఘటనల నేపథ్యంలో అక్కడ అమ్మాయిలకు ఎలాంటి రక్షణ లేదు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌లో మహిళల రక్షణ కోసం అక్కడ మిషన్ శక్తి కార్యక్రమం కొనసాగుతోంది.

 Girls Should Carry Knife For Self Defence Up Minister Says,self Defence, Up Mini-TeluguStop.com

ఈ క్రమంలోనే అమ్మాయిలు తమ రక్షణ కోసం తమ దగ్గర కత్తులను ఉంచుకోవాలి అంటూ ఆ రాష్ట్ర మంత్రి మనోహర్ లాల్ వ్యాఖ్యలు చేశారు.మహిళలు తమ రక్షణ కోసం కత్తులను దగ్గరపెట్టుకోవాలి అని, అవసరమైనపుడు వాటిని వాడాలి అంటూ యూపీ ప్రభుత్వ మంత్రి పిలుపునిచ్చారు.

జిల్లా అధికారుల సమక్షంలోనే మంత్రి మనోహర్‌లాల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది.ఇటీవల యూపీ లో చోటుచేసుకుంటున్న వరుస అత్యాచార ఘటనల నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్ననేపథ్యంలో ఆ రాష్ట్రంలోని మహిళల రక్షణ కోసం సీఎం యోగి అనేక చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలోనే మిషన్ శక్తి కార్యక్రమాన్ని చేపట్టారు.

అయితే ఈ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి మనోహర్ లాల్ మహిళలు అంతా కూడా కత్తులు పట్టాలంటూ పిలుపునిచ్చారు.

అంతేకాకుండా మహిళలు అవసరమైన సందర్భాల్లో కత్తులతో దాడులకు కూడా దిగాలని ఆయన వ్యాఖ్యలు చేశారు.లలిత్‌పూర్ పోలీస్‌లైన్‌లో జిల్లా అధికారులు, పోలీసు అధికారుల సమక్షంలో మంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది.

అయితే అధికారుల సమక్షంలో మంత్రిగారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.మహిళలు అందరూ కత్తులు చేతబట్టుకోవాలి అని అవసరమైతే దాడులకు దిగాలి అంటూ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది.

ఇటీవల యూపీ లో చోటుచేసుకున్న హత్రాస్ ఘటన అందరినీ కలచివేసిన విషయం విదితమే.తల్లితో పాటు పొలం లో పనిచేసుకుంటున్న 19 ఏళ్ల దళిత యువతిని నలుగురు అగ్రకులం యువకులు అతిదారుణంగా లాక్కెళ్లి అత్యాచారం చేసి నాలుక కోసి నరకం అనుభవించేలా చేశారు.

ఇంతలా ఆ యువతిని హింసకు గురిచేయడం తో ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది.అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

హత్రాస్ ఘటన యువతికి న్యాయం చేయాలి అంటూ పలువురు డిమాండ్ చేశారు కూడా.అయితే అది అత్యాచార ఘటన కాదు అని ఈ ఘటన వెనుక మరో కోణం ఉందంటూ అధికారులు చేతులు దులుపుకోవడం విశేషం.

సంచలనం రేపిన ఈ ఘటన పై సీఎం యోగి సీబీఐ కి అప్పగించడం తో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube