బస్సు లో సీటు కోసం కొట్టుకున్న ఇద్దరమ్మాయిలు..! ఆ అబ్బాయి ఇచ్చిన కౌంటర్ హైలైట్.!  

Girls Fighting For Bus Seat In Dilsukhnagar Hyderabad-

దిల్ సుఖ్ నగర్ నుండి హైటెక్ సిటి వైపుగా బయలుదేరింది పుష్పక్ బస్….ఒకటి, రెండు సీట్లు మినహా బస్ అంతా ఆల్ మోస్ట్ ఫుల్ గా ఉంది.

Girls Fighting For Bus Seat In Dilsukhnagar Hyderabad--Girls Fighting For Bus Seat In Dilsukhnagar Hyderabad-

ఇద్దరు ఫ్రెండ్స్ పక్కపక్కనే కూర్చొని కంపెనీ కబుర్లు చెప్పుకుంటున్నారు.బస్ లక్డికపూల్ చేరగానే జనాలంతా ఎగబడి , ఎగబడి ఎక్కారు.ఇంతకు ముందు చెప్పిన ఫ్రెండ్స్ ముందు ఓ సీటు ఖాళీగా ఉండడంతో.ఇద్దరమ్మాయిలు ఫాస్ట్ గా ఆ సీట్ వైపుగా దూసుకొచ్చారు.ఓ అమ్మాయి దూరం నుండే ఆ సీట్ మీద హ్యాండ్ బ్యాగ్ వేసింది.

మరో అమ్మాయి ఆ సీటు దగ్గరకు వచ్చి హ్యాండ్ బ్యాగ్ తీసేసి కూర్చుంది.ఓ 10 మంది దాకా నిలబడి ఉన్నారు.

ఇంతలో హ్యాండ్ బ్యాగ్ అమ్మాయి ఆ సీట్ దగ్గరికి వచ్చి ఎక్స్ క్యూజ్ మీ….ఇది నా సీట్ , మీరు లేవండి ప్లీజ్ అంది.దానికి కూర్చున్న ఆ అమ్మాయి నో…నేనే ఫస్ట్ వచ్చి కూర్చున్న అని చెప్పింది.

లేదు నేను ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ వేశాను, తర్వాత మీరొచ్చి కూర్చున్నారని ఆమె, అయినా…కర్చీఫ్ లు , హ్యాండ్ బ్యాగ్ లు వేయడానికి ఇదేమైనా పల్లెవెలుగు బస్సా అంటూ కోపానికొచ్చింది కూర్చున్న అమ్మాయి ….బస్ లోని జనాలంతా వీరివైపే చూస్తున్నారు.అది గమనించి ఎలాగైనా సీట్ దక్కించుకోవాలని ఇద్దరు పోటీ పడుతున్నారు.చిన్నపాటి గొడవ జరుగుతుంది.

పక్క సీట్లో ఉన్న ఆ కుర్రాడు…ఎక్స్ క్యూజ్ మీ…అన్నాడు.ఏంటీ అన్నట్టు చూశారు ఆ ఇద్దరమ్మాయిలు, వారితో పాటు బస్ లోని జనాలు కూడా ఆ అబ్బాయి మీద దృష్టి సారించారు.సీట్ కోసం పోట్లాట ఎందుకు నేను ఓ మాట చెబుతాను దానికి తగ్గట్టు మీలో మీరే డిసైడ్ చేసుకోండి ఎవరు ఆ సీట్లో కూర్చోవాలో వద్దో అని అన్నాడు.

ఏంటీ అన్నట్టు ఆ అమ్మాయిలతో పాటు, బస్ లోని జనాలందరు అతడు చెప్పే మాట కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఎం లేదు.మీలో వయస్సులో ఎవరు పెద్దో వారు ఆ సీట్లో కూర్చొండి.పెద్దలను గౌరవించండి అనే ఫార్ములాను ఫాలో అవుదాం అన్నాడు.అంతే…అప్పటి వరకు కుర్చీలో కూర్చొని ఉన్న అమ్మాయి ఠక్కున లేచి.సారీ మేడమ్ మీరే కూర్చొండి అంటూ ఆమెకు సీట్ ఇచ్చింది.దానికి ఆ హ్యాండ్ బ్యాగ్ అమ్మాయి సారీ….సారీ…మీరే కూర్చొండి, ఆ సీట్ మీకే అంటూ సీటుకు దూరంగా జరిగింది.మేడమ్ కూర్చొండి అని ఆమె, పర్లేదు, పర్లేదు అని ఈమె…ఇద్దరూ సీట్ కు దూరంగా జరిగారు…ఇంతలో మరో 50 యేళ్లకు పైబడిన మహిళ ఆమె థ్యాంక్స్ బాబు, కాళ్లు బాగా నొస్తున్నాయి అంటూ వచ్చి ఆ సీట్లో కూర్చుంది.