బిగ్‌బాస్‌లో అమ్మాయిల‌దే డామినేష‌న్‌... ఈ గేమ్స్‌తో అబ్బాయిల‌కు ర‌చ్చ రంబోలాయే..!

తెలుగు బుల్లితెర పాపుల‌ర్ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4 సెప్టెంబ‌ర్ 6వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు ప్రారంభం కానుంది.మొత్తం 15 మంది కంటెస్టెంట్ల‌తో 105 రోజుల పాటు ఈ ఎపిసోడ్ జ‌రుగుతుంది.

 Girls Domination In Bigg Boss,bigg Boss 4,nagarjuna,china,virus,corona,lock Down-TeluguStop.com

టాలీవుడ్ కింగ్ నాగార్జున మూడో సీజ‌న్ హోస్ట్ చేయ‌గా.నాలుగో సీజ‌న్‌ను సైతం నాగార్జునే హోస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్ప‌టికే ప్రోమోల‌తో, బిగ్‌బాస్ కంటెస్టెంట్లు వీళ్లే అంటూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న లిస్టుతో బిగ్‌బాస్ న్యూస్ ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతోంది.

ఇక మూడో సీజ‌న్లో కంటెస్టెంట్లు స్ట్రాంగ్‌గానే ఉన్నా మ‌ధ్య‌లో కొన్ని టాస్క్‌లు చ‌ప్ప‌గా ఉండ‌డంతో రేటింగ్ ప‌డిపోయింది.

ఆ త‌ర్వాత నిర్వాహ‌కులు కొత్త టాస్క్‌లు క్రియేట్ చేయ‌డంతో మ‌ళ్లీ షో ఆస‌క్తిగా మార‌డంతో పాటు టీఆర్పీలు పుంజుకున్నాయి.ఇక ఈ నాలుగో సీజ‌న్లో అదిరిపోయే ఇంట్ర‌స్టింగ్ గేమ్స్ ప్లాన్ చేశార‌ట‌.

మ‌రో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ సారి షోలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ మంది ఉన్నారు.దీంతో అబ్బాయిలు అమ్మాయిల‌తో పోటీప‌డేలా కొంత డ్రామా కూడా పండేలా టాస్క్‌లు ఉంటాయ‌ని తెలుస్తోంది.

ఈ టాస్క్‌ల‌తో అమ్మాయిలు వ‌ర్సెస్ అబ్బాయిల మ‌ధ్య షోలో కావాల్సినంత ర‌చ్చ క్రియేట్ అయ్యేలా క‌నిపిస్తోంది.ఇక షోను హోస్ట్ చేసేందుకు నాగార్జున ప్ర‌త్యేకంగా ప్రిప‌రేష‌న్ చేస్తున్నాడ‌ట‌.

మూడో సీజ‌న్లో నాగార్జున కొన్ని సార్లు షో చూడ‌కుండానే నిర్వాహ‌కులు, మెంటార్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా వీకెండ్‌లో హోస్టింగ్ మ‌మః అనిపించేశాడ‌న్న విమ‌ర్శ‌లు రావ‌డంతో ఈ సారి వాటికి తావులేకుండా ఉండేలా నాగ్ రెడీ అవుతున్నాడ‌ట‌.ఇక లాక్‌డౌన్ నేప‌థ్యంలో టీఆర్పీలు కొత్త రికార్డులు న‌మోదు చేస్తాయ‌ని కూడా స్టార్ మా ఆశ‌ల్లో ఉంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube