విజయ్ దేవరకొండ వల్ల ఇంటిపేరు మార్చుకుంటున్న అమ్మాయిలు.. ఏమైందంటే?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన విజయ్ దేవరకొండకు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.అబ్బాయిలతో పోల్చి చూస్తే అమ్మాయిలలో విజయ్ దేవరకొండకు మరింత ఎక్కువ క్రేజ్ ఉంది.

 Girls Changed Names Because Of Vijay Devarakonda Details, Vijay Devarakonda, Girls Names, Liger Movie, Liger Movie Poster, Vijay Devarakonda Fans, Director Puri Jagannath, Geeta Govindam, Ananya Panday-TeluguStop.com

తాజాగా లైగర్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.ఈ పోస్టర్ బోల్డ్ గా ఉన్నప్పటికీ అమ్మాయిల నుంచి ఈ పోస్టర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం గమనార్హం.

వచ్చే నెల 25వ తేదీన లైగర్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

 Girls Changed Names Because Of Vijay Devarakonda Details, Vijay Devarakonda, Girls Names, Liger Movie, Liger Movie Poster, Vijay Devarakonda Fans, Director Puri Jagannath, Geeta Govindam, Ananya Panday-విజయ్ దేవరకొండ వల్ల ఇంటిపేరు మార్చుకుంటున్న అమ్మాయిలు.. ఏమైందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లైగర్ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది.

ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.లైగర్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన తర్వాత చాలామంది అమ్మాయిలు తమ ఇంటిపేరుకు బదులుగా దేవరకొండ పేరును యాడ్ చేసుకుంటూ ఉండటం గమనార్హం.

ఈ స్థాయిలో క్రేజ్ ఉన్న హీరో విజయ్ మాత్రమేననే సంగతి తెలిసిందే.

విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి ఇతర హీరోల ఫ్యాన్స్ సైతం షాక్ కు గురవుతున్నారు.

విజయ్ దేవరకొండ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా రికార్డ్ స్థాయిలో హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.గీతా గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.విజయ్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ట్రాక్ లోకి రావాల్సి ఉంది.

విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కోసం ఏకంగా 25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారు.ఈ స్థాయి రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్న అతికొద్ది మంది హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు.విజయ్ దేవరకొండ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

బాక్సాఫీస్ వద్ద విజయ్ మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube