అమ్మాయిలు-అబ్బాయిలూ ఈ యాప్ మీ ఫోన్లో వుందా? ఇదొక్కటి చాలు, ఎవరికీ, దేనికి భయపడక్కర్లేదు!

ఈ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో మనకి ఎలాంటి సమాచారం కావాలన్నా ఓ యాప్ ఓపెన్ చేస్తే చాలు.మనకి అవసరమైన వివరాలతో పాటు గైడెన్స్ కూడా లభిస్తాయి.

 Girls And Boys, Do You Have This App On Your Phone  This Alone Is Enough, There-TeluguStop.com

అలాగే ఈ టెక్నాలజీ అనేది మనిషికి వివిధ రూపాలలో ఉపకరిస్తుంది.ఎంటర్టైన్ మెంట్, న్యూస్, షాపింగ్ ఇలా ఇతర సర్వీసులకే కాదు.

సెక్యూరిటీకి కూడా బాగా ఉపయోగపడుతోంది.ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి సమస్య ఎదురైనా.

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి.అందులో సంబంధిత యాప్ ఉంటే చాలు.

కొండంత అండ మనకి వున్నట్టే.ఇపుడు అలాంటి యాప్ గురించే మనం తెలుసుకోబోతున్నాం.

అవును.ఈ యాప్ మీ ఫోన్లో ఉంటే చాలు.మీరిక ఎవరికీ భయపడనవసరం లేదు.ఈ యాప్ పేరే AP Police Seva App. ఈ యాప్ మీ ఫోన్లో ఉంటే పోలీసులు మీ వెన్నంటే వున్న ఫీలింగ్ ఉంటుంది.ప్రమాదం, దాడి ఇలా సమస్య ఏదైనా సరే పోలీసులు మనకి అండగా నిలుస్తారు.

పోలీస్ సేవ యాప్ కేవలం కంప్లైంట్ ఇవ్వడం, పోలీసులకు సమాచారం అందించడమే కాదు.మొత్తం 87 రకాల సేవలను సింగిల్ యాప్ ద్వారా అందిస్తోంది ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్.

మొత్తం 6 విభాగాల్లో సాయం పొందే అవకాశముంది.

లా అండ్ ఆర్డర్, ఎన్ ఫోర్స్ మెంట్, పబ్లిక్ సర్వీస్, రోడ్డు భద్రక, పబ్లిక్ రిలేషన్స్, పబ్లిక్ ఔట్ రిచ్ వంటి విభాగాల్లో పోలీసులు సేవలందిస్తారు.

లా ఆండ్ ఆర్డర్ విభాగంలో హత్యలు, దాడుల వంటి నేరాలు, వేధింపులకు సంబందించిన కంప్లైంట్స్, FIR స్టేటస్, దొంగతనాలు, రికవరీలు, మిస్సింగ్ కేసులు, గుర్తుతెలియని మృతదేహాలు, అరెస్టులు, కిడ్నాపుల వంటివాటిపై వివరాలు పొందే అవకాశముంది.ఎన్ ఫోర్స్ మెంట్ విభాగంలో హౌస్ మానిటరింగ్ సిస్టమ్, ఈ-బీట్, ఈ-చలాన్ వంటి స్టేటస్ లు సులభంగా తెలుసుకొవచ్చు.

పబ్లిక్‌ సర్వీస్ విభాగంలో కంప్లైంట్స్, సర్వీస్ కి సంబంధించిన అప్లికేషన్లు, ఎన్ఓసీలు, వెరిఫికెషన్లు, లైసెన్సులు, పర్మిషన్స్, పాస్ పోర్ట్ వెరిఫికేషన్ వంటి సేవలు పొందవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube