ఎంత ట్రై చేసినా ఒక్క అమ్మాయి కూడా పడట్లేదా... అయితే మీకోసమే ఇది...

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం ఏదంటే అందరికీ టక్కున గుర్తొచ్చే దేశం చైనా.అందువల్లనే ఈ దేశంలో వ్యాపారం చాలా జోరుగా సాగుతుంది.

 Girlfriend Song Rent In China News-TeluguStop.com

ఎంతలా అంటే తాజా నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో చైనా దేశం రెండో స్థానంలో ఉంది.అయితే ఈ దేశంలో డబ్బుంటే కానిదంటూ ఏమీ లేదు.

ఇందులో ముఖ్యంగా అత్యధిక ధరలు వెచ్చించి బ్రాండెడ్ వస్తువులు కొనలేనటువంటి వారు ప్రత్యామ్నాయంగా తక్కువ ధరలో దొరికేటువంటి డూప్లికేట్ వస్తువులను వాడుతూ ఆనందం పొందుతుంటారు.అయితే ప్రపంచంలో ఎక్కువగా నకిలీ వస్తువులలో చైనా దేశంలోనే తయారు చేస్తున్నారు.

 Girlfriend Song Rent In China News-ఎంత ట్రై చేసినా ఒక్క అమ్మాయి కూడా పడట్లేదా… అయితే మీకోసమే ఇది…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇది వరకే చెప్పినట్లు ఈ దేశంలో డబ్బులు వెచ్చించి ఏదైనా కొనవచ్చు.మామూలుగా కొన్ని దేశాలలో తప్పులు చేసినప్పుడు బీద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ చట్టాలు సమానంగా వర్తిస్తాయి.

కానీ ఈ దేశంలో మాత్రం ధనికులు తప్పు చేస్తే వారికి బదులుగా శిక్షను అనుభవించేందుకు మరొకరిని జైలుకు పంపే అవకాశం ఉంటుందట.కాకపోతే తమకు బదులుగా శిక్ష అనుభవించే వారికి లక్షలు లేదా కోట్ల రూపాయలు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

ఇక ఈ దేశంలో మానవతా విలువలను మరియు ఎమోషన్స్ ని కూడా కొనుక్కోవడానికి వీలు ఉంటుంది.

మానవ జీవితంలో ప్రేమ అనేది చాలా ముఖ్యమైన అంశం.

అంతేకాకుండా ఇది అన్నింటి కంటే స్వచ్ఛమైనది కూడా.కానీ చైనా దేశంలో డబ్బులకి గర్ల్ ఫ్రెండ్స్ ని కూడా కొనుక్కోవచ్చు.

ఇందులో భాగం గా పలు సంబంధిత వెబ్ సైట్లలో మనకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని ఎంత కాలం పాటు ప్రేమించాలనే నిబంధనలు వివరించి అందుకు తగిన మొత్తాన్ని ఆమెకు చెల్లిస్తే కొంతకాలం పాటు ప్రేమిస్తుందట.కానీ మనం అద్దెకు తీసుకున్న గర్ల్ ఫ్రెండ్ ను బలవంతంగా తాకడం లేదా అత్యాచారం చేయడం వంటివి చేస్తే కఠిన శిక్షలు విధిస్తారు.

దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ ఎలాంటి కల్మషం లేని ప్రేమ మానవుల జీవితంలో ఎంతో ముఖ్యమని కానీ ఈ ప్రేమ డబ్బుతో లేదా మరే ఇతర నిబంధనలతో కూడుకున్న ప్రేమలు ఎక్కువ కాలం నిలబడవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కానీ తాత్కాలిక ఆనందాల కోసం వెంపర్లాడే వారికి ఈ వెసులుబాటు బాగా నచ్చుతుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

#GirlfriendRent #GirlFriend

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు