బాయ్ ఫ్రెండ్ భార్య కళ్ళల్లో ఫెవిక్విక్ పోసి... జుట్టు కత్తిరించి..?  

Bihar woman Throws feviquick in boy friend\'s wife eyes, feviquick, hair cut, bihar, boy friend, wife, newly married woman - Telugu Bihar, Bihar Woman Throws Feviquick In Boy Friend\\'s Wife Eyes, Boy Friend, Feviquick, Hair Cut, Newly Married Woman, Wife

సాధారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నప్పుడు అబ్బాయి మోసం చేసి వేరొక పెళ్లి చేసుకుంటే అమ్మాయి వెళ్లి అబ్బాయితో గొడవ పడటం, లేదా అబ్బాయి గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటివి మనం చూస్తూ ఉంటాం.కానీ బీహార్ లో ఇందుకు విరుద్ధంగా ఒక సంఘటన జరిగింది.

TeluguStop.com - Girlfriend Puts Faviquick In Boyfriends Wife Eyes And Cuts Hair

తను ప్రేమించిన వ్యక్తి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో ఆ వ్యక్తి భార్య కి జుట్టు కత్తిరించేసిన వింత ఘటన చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన సమాచారం మేరకు…
బీహార్ నలంద ప్రాంతంలో నివాసముంటున్న గోపాల్ రామ్ అనే వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించాడు.అయితే గోపాల్ రామ్ ఇంట్లో పెద్దలు కుదిర్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

అయితే గోపాల్ రామ్ తన గర్ల్ ఫ్రెండ్, తనని మోసం చేశాడనే కోపంతో గోపాల్ రామ్ భార్యపై కక్ష పెంచుకుంది.గోపాల్ రామ్ పెళ్లి చేసుకున్న తర్వాత తన సొంత గ్రామమైన మోరా తాలాబ్ కి తన భార్యతో కలిసి వచ్చాడు.

TeluguStop.com - బాయ్ ఫ్రెండ్ భార్య కళ్ళల్లో ఫెవిక్విక్ పోసి… జుట్టు కత్తిరించి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

గోపాల్ రామ్ చెల్లెల ద్వారా ఇంట్లోకి వచ్చిన తన గర్ల్ ఫ్రెండ్ అందరితో కలిసి మెలిసి ఎంతో ఆనందంగా ఉన్నట్లు నటిస్తూ, రాత్రి అందరూ పడుకున్న సమయంలో గోపాల్ రామ్ గదిలోకి వెళ్లి తన భార్య కళ్లపై ఫెవిక్విక్ పోసి, జుట్టు కత్తిరించి తన పగ తీర్చుకుంది.ఫెవిక్విక్ తన కళ్ళలోకి పోయటం వల్ల కళ్ళు మంటలు వచ్చి నవవధువు గట్టిగా కేకలు వేసింది.ఒక్కసారిగా నిద్రలోంచి మేల్కొన్న కుటుంబ సభ్యులు పారిపోతున్న ఆ యువతిని పట్టుకున్నారు.

ఆ యువతిని పట్టుకున్న కుటుంబ సభ్యులు ఆమెను చితకబాది అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చికిత్స నిమిత్తం నవ వధువును ఆస్పత్రికి తరలించగా కళ్ళల్లోకి ఫెవిక్విక్ పడటం వల్ల చూపు కోల్పోయిందని వైద్యులు తెలిపారు.సదరు యువతి పై భగన్ బిఘా పోలీస్ అధికారి మహ్మాద్ సిబ్లి నోమాని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

#NewlyMarried #Boy Friend #Hair Cut #BiharWoman #Bihar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు