ఇంట్లో ఇల్లాలు పార్కులో ప్రియురాలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ భర్త.. చివరకు

సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ తెలుగు వారందరికీ బాగా ఇష్టమైన చిత్రం అని చెప్పొచ్చు.కాగా, ఈ సినిమా చూసి అప్పట్లో ఇళ్లలోని మహిళలు తమ భర్తల గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు.

 Girlfriend In The Park At Home Husband Caught Red Handed Finally , Illigal Affai-TeluguStop.com

ఇప్పుడు ఈ చిత్రం సంగతి ఎందుకంటే.ఓ భర్త ఈ సినిమాను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నాడే ఏమో తెలియదు.

కానీ, ఇంట్లో భార్య ఉండగానే ప్రియురాలితో ఎంజాయ్ చేయడం షురూ చేశాడు.ఇందుకు పార్కును వేదికగా ఉపయోగించుకున్నాడు.

తాను బాగా వెయిట్ పెరుగుతున్నానని, వెయిట్ లాస్ కోసం జాగింగ్ వెళ్తానని చెప్పి ప్రతీ రోజు పార్కుకు వెళ్లి ప్రియురాలితో గడుపుతున్నాడు.అయితే, భర్త వెయిట్ తగ్గకపోవడం చూసి ఒక రోజు అతడిని ఫాలో అయి పార్కులో అతడు చేస్తున్న ఘన కార్యాన్ని చూసి షాక్ అయింది.

ప్రియురాలితో భర్తను చూసింది.అది గమనించిన భర్త అక్కడి నుంచి వెంటనే పరుగులు తీయడం స్టార్ట్ చేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట ప్రస్తుతం తెగ వైరలవుతోంది.

సోషల్ మీడియాలో వైరలవుతున్న సదరు వీడియోకు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియరాలేదు.

అయితే, జాగింగ్ పేరు చెప్పి ప్రతీ రోజు పార్కులో ప్రియురాలితో ముచ్చటిస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది భార్య.పార్కులో భార్య గొంతు వినగానే భర్త అక్కడి నుంచి మెల్లగా జారుకునే ప్రయత్నం చేశాడు.

ఆగు అని భార్య అంటున్నప్పటికీ పట్టించుకోకుండా పరుగో పరుగు అన్న మాదిరిగా భర్త పరిగెడుతున్నాడు.ఈ వీడియో చూసి నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.‘ఇంటికెళ్లాక నీకుంటుంది చూడు, బుక్కయ్యావ్ పో నీకు చుక్కలు చూపిస్తుంది చూడు’ అని కామెంట్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.ఇక ప్రతీ రోజు ఎలాగో అలాగ తప్పించుకోగలిగావ్ కానీ ఈ రోజు నువ్వు పట్టబడ్డావ్ భయ్యా అని పేర్కొంటూ వీడియోలోని భర్తను ఉద్దేశించి మరి కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube