ప్రియుడిని చొక్కా పట్టి ఈడ్చుకెళ్ళిన ప్రియురాలు

ప్రేమించాడు.పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.అవసరం తీరాక వదిలి వెళ్లిపోయాడు.అయితే తనకు జరిగిన మోసానికి కుంగిపోలేదు ప్రేమించిన వాడి ఆచూకీ తెలుసుకుని ఇంటికి వెళ్లి నిలదీసింది.తనతో రమ్మని కోరగా అతడు ససేమిరా అనడంతో కాలర్ పట్టుకుని పోలీస్ స్టేషన్ కి ఈడ్చి కెళ్ళింది.పోలీసులను తనకు న్యాయం చేయాలని ఆర్ధించింది.

 Girl Who Dragged Her Cheated Lover To Police Station In Raigad District-TeluguStop.com

వివరాల్లోకి వెళితే.రాయగడ జిల్లా లోని బిసంకటక్ ఐఐసీ చోటు చేసుకున్న ఈ ఘటన… ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బిసంకటక్ ఐఐసీ అధికారి సుభాష్ చంద్ర కొరకొరా తెలిపిన వివరాల ప్రకారం కుంకుబడి గ్రామానికి చెందిన యువకుడు సుమన్ కుసిలియా ఉపాధి కోసం ఆరు నెలల క్రితం ఆంద్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రొయ్యల పరిశ్రమలో పలికి చేరాడు.అదే పరిశ్రమలో పని చేస్తున్న విశాఖపట్నం జిల్లా పాడేరు కు చెందిన యువతి బెలసుర కుమారితో స్నేహం ఏర్పడింది.

 Girl Who Dragged Her Cheated Lover To Police Station In Raigad District-ప్రియుడిని చొక్కా పట్టి ఈడ్చుకెళ్ళిన ప్రియురాలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో మూడు నెలల క్రితం అక్కడికి సమీపంలోని ఆలయంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.కలిసి కొన్నాళ్ళు కాపురం చేసిన తరువాత కొద్ది రోజుల క్రితం సుమన్ ఎవరికీ చెప్పకుండా భీమవరం నుంచి బిసంకటక్ వచ్చేశాడు.

రోజులు గడుస్తున్నా తన భర్త తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆమె అతని ఆచూకీ కోసం ఆరా తీసింది.

Telugu Belasura Kumari, Bisamkatak, Cheated, Dragged Her Cheated Lover, Girl, Married Another Woman, Police Case Booked, Police Station, Raigad District, Suman-Telugu Crime News(క్రైమ్ వార్తలు)

తన భర్త స్వగ్రామంలో ఆటో నడుపుతున్నాడని తెలుసుకుని తన అన్నయ్య సాయంతో బిసంకటక్ కు చేరుకుంది.అక్కడకు చేరుకుని ఆటో స్టాండ్ లో ఎదురైనా సుమన్ ను నిలదీసింది.తనతో రమ్మని ఎంతగానో ప్రాధేయపడగా అతను అంగీకరించలేదు.

తనకు కొద్దిరోజుల క్రితమే వేరే అమ్మాయితో వివాహం జరిగిందని చెప్పడంతో ఆమె ఆగ్రహానికి గురైంది.అందరూ చూస్తుండగానే అతను షర్టు, కాలర్ పట్టుకుని పోలీస్ స్టేషన్ కు ఈడ్చుకుంటూ వెళ్ళింది.

పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ సుమన్ ను అదుపులోకి తీసుకుని కేసు విచారణ చేస్తున్నారు.

#Married Woman #Suman #Bisamkatak #Belasura Kumari #Booked

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు