ఇటీవల కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అత్యాచారాలకు పాల్పడే వారి సంఖ్య అధికంగా పెరుగుతోంది.మహిళలకు రోజురోజుకు రక్షణ కరువు అవుతోంది.
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చి కఠినంగా శిక్షించిన సమాజంలో మార్పు రావడం లేదు.పైగా మైనర్ యువకులు కూడా ఒంటరిగా కనిపించే బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతూ ఉండడంతో.
రోడ్లపై ఒంటరిగా తిరిగే మహిళలకు రక్షణ లేకుండా పోతుంది.ఇలాంటి కోవలోనే తాజాగా హైదరాబాద్ లోని( Hyderabad ) బోరబండలో ఓ అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.హైదరాబాద్ లోని బోరబండ( Borabanda ) పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ 14 సంవత్సరాల బాలిక స్థానిక పాఠశాలలో ఏడవ తరగతి చదువుతోంది.అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లు( Minor Boys ) ఆ బాలికను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు.
అంతేకాదు అత్యాచారానికి పాల్పడుతున్నప్పుడు వీడియోలు తీసి, అవి చూపించి ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేస్తూ,తమకు సహకరించకపోతే చంపేస్తామని బెదిరించి కొన్ని రోజులుగా ఆ అమ్మాయి పై లైంగిక దాడికి పాల్పడుతున్నారు.
అయితే ఆ మైనర్ల వేధింపులు భరించలేక పోయిన ఆ బాలిక చివరికి తెగించి తన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పేసింది.దీంతో బాలిక తల్లిదండ్రులు బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు ఇద్దరు మైనర్ నిందితులపై ఫోక్సో యాక్ట్( POCSO Act ) కింద కేసు నమోదు చేసి, బాధితురాలికి కౌన్సిలింగ్, వైద్య పరీక్షల నిమిత్తం భరోసా కేంద్రానికి పంపించారు.
ఆ మైనర్ నిందితులకు ఈ విషయం తెలియడంతో పరారయ్యారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.