వైరల్ వీడియో: సీలింగ్ పై వేలాడుతున్న జుట్టు.. తీరా చూస్తే..?

మీరు హర్రర్ సినిమాలను ఎక్కువగా ఇష్ట పడతారా.? అయితే మీకు ఈ స్టోరీ చెప్పాలి.నిజంగానే హర్రర్ సినిమాను చూసినట్లు ఉంటుది ఈ స్టోరీ.సినిమాలో మాదిరి దెయ్యాలు గోడల పైన సీలింగ్ మీద పాకడం, అలాగే మనిషి కనిపించకుండా పైన జుట్టు మాత్రమే వేలాడుతూ కనిపించడం లాంటి ఎన్నో సీన్లను మనం సినిమాల్లో చూసే ఉంటాము కదా.సరిగ్గా అలాంటి సీన్ ఒకటి నిజ జీవితంలో కూడా చోటు చేసుకుంది.ఒక దంపతులు ఇద్దరు బయట పని చేసుకుని తిరిగి ఇంటికి చేరుకొని కాసేపు సోఫాలో విశ్రాంతి తీసుకుంటూ తల పైకి ఎత్తి చూడగా ఒక భయంకరమైన దృశ్యం వాళ్ళ కంట పడింది.

 Girl Gets Head Stuck In Ceiling Fan Freak Accident, Celing, Viral Video, Viral L-TeluguStop.com

అది చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.సోఫాలో కూర్చున్న వారికి సీలింగ్‌ పైన వేలాడుతున్న నల్లటి జుట్టు కనిపించింది.ముఖం మాత్రం కనపడకుండా జుట్టు ఒక్కటే కిందకి వేలాడడం చూసి ఆ దంపతులు దెయ్యం అనుకుని హడలెత్తిపోయారు.గుండె నిబ్బరం చేసుకుని అసలు ఆ జుట్టు ఎవరిది అని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి పై అంతస్తుకు వెళ్ళారు.

తీరా అక్కడకు వెళ్ళాక వాళ్లకు ఎమన్నా కనిపించిందా.? లేక మాయం అయిందా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.సౌత్ వెస్ట్ చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌ లోని పుడింగ్ కౌంటీలో చోటు చేసుకుంది.అయితే ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఓ చిన్నారి పై అంతస్థులో ఆట ఆడుకుంటూ పైన ఉన్న చిన్న రంధ్రంలోకి తన తలను దూర్చింది.అయితే తరువాత ఆ పాప తన తలను పైకి తీసే క్రమంలో ఎంత ప్రయత్నించినగాని తల పైకి రాలేదు.

సరిగ్గా ఇదే సమయంలో ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఆ పాప జుట్టుని చూసి షాక్ అయ్యారు.

అసలు అక్కడ అంత పెద్ద రంధ్రాన్ని ఎందుకు పెట్టారంటే అక్కడ ఫ్యాన్ ఫిట్ చేసే క్రమంలో ఆ హోల్ పెట్టినట్లు తెలుస్తుంది.తల్లిదండ్రులు జుట్టు ఎవరిదని తెలుసుకునే క్రమంలో డాబా పైకి వెళ్లి చూడగా వాళ్ళ పాప కనిపించడంతో కంగారుపడి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.దాదాపుగా 40 ని.పాటు ఎంతో శ్రమించి ఆ అమ్మాయికి ఎటువంటి గాయాలు తగలకుండా జాగృత్తగా బయటికి తీసి ఆ తర్వాత ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

నెటిజన్లు సైతం ఈ వీడియోను చూసి ఒక దెయ్యంను చూసిన భావన కలిగిందని కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube