న్యూజిలాండ్ ప్రధానికి లంచం ఇచ్చిన బాలిక...ఎందుకో తెలిస్తే..  

Girl Gave Bribe Money To New Zealand Prime Minister-new Zealand Prime Minister,టెలీ కైనెటిక్స్,న్యూజిలాండ్ ప్రధాని,విక్టోరియా

అమెరికాలో ఈ సంఘనట సంచలనం సృష్టించింది. ఓ 11 ఏళ్ల బాలిక న్యూజిలాండ్ ప్రధానికి ఐదు డాలర్లు లంచంగా పంపింది. ఇంతకీ ఆ బాలిక ఎందుకు ప్రధానికి లంచం ఇచ్చింది అనే వివరాలలోకి వెళ్తే షాక్ తినక మానరు.న్యూజిలాండ్‌కు చెందిన విక్టోరియా అనే ఓ బాలికకి డ్రాగన్లు అంటే ఎంతో ఆసక్తి చూపుతుంది..

న్యూజిలాండ్ ప్రధానికి లంచం ఇచ్చిన బాలిక...ఎందుకో తెలిస్తే..-Girl Gave Bribe Money To New Zealand Prime Minister

అంతేకాదు టైలికైనెటిక్ పవర్స్ ద్వారా డ్రాగన్లకు శిక్షకురాలిగా మారాలని భావించింది. అనుకున్నదే తడవుగ

టెలీ కైనెటిక్స్, డ్రాగన్లపై పరిశోధనలు చేయాలంటూ ఆ దేశ ప్రధానికి లేఖని రాసింది. మీరు వీటిపై పరిశోధనలు జరపండి ఊరికే ఏమి వద్దు అంటూ ఏకంగా ప్రధానికే 5 న్యూజిలాండ్ డాలర్లను లంచంగా పంపింది. అయితే ఆ చిన్నారి లేఖకి స్పందించిన న్యూజిలాండ్ ప్రధాని ఆ బాలికకి తిరిగి లేఖని రాశారు.

ఫిజిక్స్, డ్రాగన్ల విషయంలో నీ సూచనలు ఆసక్తికరంగా ఉన్నాయి. కానీ

దురదృష్టవశాత్తూ, ప్రస్తుతం ఈ విభాగంలో పరిశోధనలు చేయడం లేదు. అలాంటి అవకాశమే లేదు కాబట్టి నువ్వు లంచంగా ఇచ్చిన డబ్బును మళ్ళీ నీకు తిరిగి పంపుతున్నాను. టెలీకినెసిస్, టెలీపతి, డ్రాగన్ల అన్వేషణలో నీ ప్రయత్నాలు ఫలించాలని కోరుకుంటున్నాను అంటూ లేఖలో పేర్కొన్నారు ప్రధాని.