వైరల్ వీడియో : 12వ ఫ్లోర్ నుండి పడుతున్న చిన్నారిని క్యాచ్ పట్టుకున్న వ్యక్తి..

ఒక చిన్నారి ప్రాణాలను కాపాడి ఇప్పుడు అతడు రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయాడు.ఆ చిన్నారి పై నుండి పడిపోతుంటే అతడు క్యాచ్ పట్టుకుని ఆ చిన్నారి ప్రాణాలను కాపాడాడు.

 Girl Falls From 12th Floor Balcony Delivery Driver Catches Her-TeluguStop.com

క్యాచ్ పట్టుకోవడం అంటే ఏ గోడ మీద నుండో పడిపోతుంటే పట్టుకున్నాడేమో అని అనుకుంటున్నారా కాదు అతడు ఆ చిన్నారిని ఏకంగా 12 వ అంతస్తు నుండి పడుతుంటే క్యాచ్ పట్టుకున్నాడు.

ఏంటి నమ్మడం లేదా అవును నిజమే ఆ చిన్నారి ప్రమాదవు శాత్తు 12 వ అంతస్తులో ఉన్న వాళ్ళ ఇంటి బాల్కనీ నుండి పడబోతుంటే కింద ఉన్న ఆ వ్యక్తి తన ప్రాణాలకు తెగించి ఆ పాపను రక్షించాడు.

 Girl Falls From 12th Floor Balcony Delivery Driver Catches Her-వైరల్ వీడియో : 12వ ఫ్లోర్ నుండి పడుతున్న చిన్నారిని క్యాచ్ పట్టుకున్న వ్యక్తి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మాములుగా పై నుండి పడే వారిని కింద ఉన్న వారు కాపాడడం అంటే మాములు విషయం కాదు.ఏదైనా వస్తువు పడితేనే మనం పట్టుకోలేము అలాంటిది అతడు బరువైన ఆ చిన్నారిని కాపాడి అందరిని ఆశ్చర్యపరిచాడు.

న్గుయెన్ న్గోక్ మన్హ్ అనే వ్యక్తి డెలివెరి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.ఆ చిన్నారి కిందకు పడే సమయంలో అతడు ఆ ఇంటి ముందే కారులో కూర్చుని ఉన్నాడు.

సడెన్ గా ఆ వ్యక్తికి ఒక మహిళా గొంతు వినపడడంతో అతడు కారు నుండి బయటకు దిగి చూడడంతో ఒక చిన్నారి బాల్కనీ పై నుండి కిదకు పడడం గమనించాడు.వెంటనే అతడు పై నుండి పడుతున్న ఆ చిన్నారిని కాళ్ళు పట్టుకుని కాపాడాడు.

అతడు స్పందిస్తూ నేను ఒక డెలివెరీ ఇవ్వడానికి అక్కడకు వచ్చాను.అప్పుడు ఒక మహిళ అరవడం విని కారు నుండి దిగి చూడడంతో పై నుండి ఒక చిన్నారి పడడం చూసాను.

వెంటనే నేను ఆ చిన్నారిని కాపాడడానికి పక్కనే ఉన్న రూఫ్ ఎక్కి ఆ చిన్నారి పడుతున్న సమయంలో తన కాళ్ళు పట్టుకోగలిగాను అని చెప్పాడు.అతడు ఎత్తులో ఉన్నాడు కాబట్టి ఆ పాపకు ఎలాంటి గాయం అవ్వలేదు.

ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ అతడిని అభినందిస్తున్నారు.

#GirlFalls #Vietnam #ChildFalls #ChildFalls

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు