వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికి తెలుసు అని అన్నారు పెద్దలు.అయినా వయస్సుతో సంబంధం లేకుండా వచ్చేది మరణం.
ఈ మరణానికి జాలి దయ అనేటివి ఉండవు కావచ్చూ అందుకే పసిపిల్లలను కూడా నిర్ధాక్ష్యణ్యంగా తీసుకుపోతుంది.
ఇప్పుడు మనం చదవబోయే సంఘటన కూడా అలాంటిదే.
గో ఏయిర్ విమానంలో ప్రయాణిస్తున్న ఓ బాలిక హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయింది.ఆ వివరాలు తెలుసుకుంటే.
ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆయుషి పున్వసి ప్రజాపతి అనే ఏడేళ్ల బాలిక అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆమె తండ్రి ముంబైలోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లటానికి గో ఏయిర్ విమానాన్ని ఎక్కారు.అయితే విమానం గాల్లో ఉండగా బాలిక కార్డియాక్ అరెస్ట్‌కు గురై మరణించిందట.
దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ద్వారా విమానాన్ని ఆపి బాలికను నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారట.కాగా ఆ పాప రక్తహీనతతో బాధపడుతున్నందువల్ల విమానం గాల్లోకి ఎగిరిన సమయం లో కార్డియాక్ అరెస్ట్‌కు గురైనట్లు అభిప్రాయాలు వెల్లడవుతున్నాయట.
ఇకపోతే ఈ ఘటనపై గో ఏయిర్ అధికారులు మాట్లాడుతూ సాధారణంగా 8 నుండి 10గ్రాముల కంటే తక్కవ హిమోగ్లోబిన్ ఉన్న వాళ్లు విమాన ప్రయాణానికి అనర్హులు.ఆ పాపకు కేవలం 2.5 హిమోగ్లోబిన్ మాత్రమే ఉంది.దీని చికిత్స నిమిత్తమే ముంబై వెళుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని వెల్లడించారు.