వైరల్ వీడియో: చీరకట్టులో అమ్మాయి డ్యాన్స్ అదుర్స్...!

ప్రస్తుతం జనరేషన్ లో ఉన్న ఆడవారు, అమ్మాయిలు చాలామంది పొట్టి పొట్టి డ్రస్సులు వేసుకొని, అలాగే జీన్స్ టీ షర్ట్ వేసుకుని డాన్స్ చేస్తున్నారు.ఏదో క్లాసికల్ డాన్స్ వారు మినహాయించి మిగతా వారందరూ ఇలా చేసే వారే.

 Girl Dance Supereb In Saree-TeluguStop.com

ఇక చీర కట్టుకొని డ్యాన్స్ చేసే వారు చాలా తక్కువే అని చెప్పాలి.అందులో మరీ ముఖ్యంగా అమ్మాయిలు అసలు చేయలేరు.

అలాంటిది ఓ అమ్మాయి తాను డాన్స్ వేసే సమయంలో చీర కట్టుకొని మామూలు డాన్స్ కాకుండా ‘హులా హోప్’ అనే నృత్యాన్ని చేసింది.ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 Girl Dance Supereb In Saree-వైరల్ వీడియో: చీరకట్టులో అమ్మాయి డ్యాన్స్ అదుర్స్…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సోషల్ మీడియాలో ఈ వీడియో కి సంబంధించి సారెఫ్లో అనే కొత్త హాష్ టాగ్ తో చీరకట్టులో డాన్స్ సాధ్యమే అంటూ కనపడుతుంది.నిజంగా ఈ వీడియోలో ఆ అమ్మాయి డాన్స్ చాలా బాగా చేసింది.

ఇంకా ఆ అమ్మాయి విషయానికి వస్తే.హులా హోప్ నర్తకి ఎష్నాకుట్టి ఈవిడ ఢిల్లీ ప్రాంతానికి చెందిన వ్యక్తి.

ఈ వీడియో చేసే సమయంలో తన తల్లి యొక్క ఆరు అంగుళాల చీరను కట్టుకుని ఆపై షూస్ ధరించి చేతిలో గుండ్రంగా ఉండే ఓ రింగ్ ను కూడా పట్టుకొని అబ్బురపరిచే డాన్స్ వేసింది.

ప్రస్తుతం ఈ వీడియోని చూసి నెటిజెన్స్ నిజంగా ఫిదా అయ్యారు అని చెప్పవచ్చు.

అయితే ఈ వీడియో షేర్ చేయడానికి ఓ బలమైన కారణం ఉంది.అమ్మాయిలు ఎలాంటి ఒత్తిడీ, అలాగే ఇబ్బంది లేకుండా చీర ధరించగలరని… చీరను ధరించడం వల్ల ఎంతో హాయిగా, సుఖంగా ఉంటుందని వెల్లడించింది.

అంతేకాకుండా భారతీయులు తమ కల్చర్ ను ఎప్పటికి మరవద్దని ఆమె కోరుతుంది.అయితే ఆవిడ ఇలా చీర కట్టుకొని డాన్స్ చేయడం మొదటిసారి కాదు.

ఇదివరకే ఆవిడ 2 వీడియోలు కూడా చేసింది.ఈ వీడియోని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా చూసి ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

తనకి ఈ వీడియో చాలా ఆలస్యంగా దొరికిందని, అయితే చూడగానే చాలా ఆశ్చర్యపోయాను అంటూ తెలిపాడు.

#Sareeflow #Dance

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు