ఆ హాస్పిటల్ లో ఆడపిల్ల పుడితే అన్నీ ఫ్రీ…!  

girl child, boy child, pregnant, hospital, Docter, operation - Telugu Boy Child, Docter, Girl Child, Hospital, Operation, Pregnant

ఇదివరకు పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే, పురిటిలోనే చంపేసే వారిని చాలా మందినే చూసి ఉంటారు.అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

 Girl Child Boy Child Pregnant Hospital Docter Operation

చాలా మంది అబ్బాయిలు లేకున్నా సరే… అమ్మాయి మాత్రం కచ్చితంగా ఉండాలని భావించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.అబ్బాయిలకు ఏమి తీసిపోనట్లుగా అమ్మాయిలను కూడా తల్లిదండ్రులు పెంచుతున్నారు.

ప్రస్తుత జనరేషన్ తల్లిదండ్రులకు ఆడపిల్ల, మగ బిడ్డ అని తేడా లేకుండా వారిని పెంచుతున్నారు.అయితే ఇదివరకు రోజుల్లో కొంతమంది ఆడపిల్ల పుట్టిందని హాస్పిటల్లోనే వదిలేసిన ఎన్నో ఘటనలు మనకు తెలిసిందే.

ఆ హాస్పిటల్ లో ఆడపిల్ల పుడితే అన్నీ ఫ్రీ…-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఆడపిల్ల లేనిదే ప్రపంచం లేదు.మానవుని జీవితం లేదు.

అయితే ఇంకా కొంతమంది ప్రజలు ఆడపిల్ల పుట్టిందంటే వారిని వదిలివేసే దుర్మార్గులు కూడా ఉన్నారు.అయితే వారిని కూడా మార్చాలని ఓ మంచి ఉద్దేశంతో ఓ లేడి డాక్టర్ తన ఆసుపత్రిలో ఆడపిల్ల పుడితే ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా చికిత్స చేస్తోంది.

ఆ హాస్పిటల్ లో గర్భిణీ ఆడ శిశువుకు జన్మను ఇస్తే… ఆసుపత్రి ఖర్చులు మాత్రమే కాకుండా, కేవలం ఒక్క పైసా కూడా వారి దగ్గరనుంచి తీసుకోదు డాక్టర్ అమ్మ.ఇక ఆ డాక్టర్ పేరు శిప్రాధర్.ఈమె వారణాసి నగరంలోని ప్రముఖ గైనకాలజిస్ట్.ఇంతవరకు వరకు ఆవిడ కొన్ని వందల ఆడపిల్లలకు ప్రాణ దానం చేసింది.ఇకపోతే ఆడపిల్ల పుట్టిన తల్లిదండ్రుల నుంచి ఎటువంటి పైసా కూడా ఆమె ఆశించకుండా వారికి సేవలు అందిస్తోంది.

ఈ విషయం గురించి డాక్టర్ మాట్లాడుతూ.

ఒకవేళ తల్లిదండ్రులకు మగ పిల్లవాడు పుడితే, అందరూ సంబరాలు చేసుకుంటారు.అదే ఆడపిల్ల పుడితే మాత్రం అయ్యో.ఆడపిల్లనా…! నీకు ఖర్చులు తప్పవురా అంటూ చాలామంది మొహం మీదనే చెబుతుంటారు.అయితే ఇలాంటి నేపథ్యంలో ఆడపిల్లలు ఎందులోనూ తీసిపొరని, అది అందరూ గ్రహించాలని ఆమె తెలియజేస్తున్నారు.

ఇలాంటి మాటలు విని తాను వారికోసం ఏమైనా చేద్దామనిపించి… ఇలా చేస్తున్నట్లు డాక్టర్ తెలియజేశారు.

#Docter #Boy Child #Pregnant #Hospital #Girl Child

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Girl Child Boy Child Pregnant Hospital Docter Operation Related Telugu News,Photos/Pics,Images..