సీఏఏ సభలో పాకిస్థాన్ నినాదం చేసిన అమ్మాయి  

Girl Chants Pakistan Zindabad At Owaisis Public Meeting - Telugu Caa Act, Girl Chants Pakistan Zindabad, Nrc, Owaisis Public Meeting

లౌకికవాదం, సెక్యులరిజం ముసుగులో దేశంలో అరాచకం సృష్టించే వారు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయారు.హిందుత్వ వ్యతిరేక విధానాలు, దేశ వ్యతిరేక విధానాలకి పాల్పడుతూ ఇది మా హక్కు.

Girl Chants Pakistan Zindabad At Owaisis Public Meeting - Telugu Caa Act Nrc

మాకు ఏదైనా మాట్లాడే స్వేచ్చ రాజ్యాంగం కల్పించింది అంటూ గొడవ చేస్తున్నారు.అదే పనిగా మతాల మధ్య చిచ్చు పెట్టి దేశంలో అసహనం, అశాంతి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

ఇలాంటి వారిపై సంఘ విద్రోహక శక్తులు అని కేసులు పెడితే వారి తరుపున వకాల్తా పుచ్చుకొని లౌకికవాదంకి ఇది గొడ్డలి పెట్టు అంటూ రోడ్డు మీదకి వస్తున్నారు.ప్రస్తుతం ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం సిఏఏ, ఎన్నార్సీ వంటి చట్టాలని అమలు చేయాలని భావిస్తుంది.

ఈ చట్టాలు అమలైతే కలుగులో దాగున్న దేశ ద్రోహులు, ఇతర దేశాల నుంచి ఇండియాలోకి అక్రమంగా వచ్చి ఇక్క శాంతి భద్రతల విఘాతానికి కారణం అవుతున్న వారు బయటకి వస్తున్నారు.అందుకే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొంత మంది రాజకీయ మేధావులు రోడ్డెక్కారు.

ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి ఈ చట్టాలకి వ్యతిరేకంగా ఉద్యమించేలా సభలు పెడుతున్నారు.ఈ నేపధ్యంలో బెంగుళూరు వేదికగా సీఏఏ వ్యతిరేకిస్తూమజ్లీస్ అసదుద్దీన్ ఒవైసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది.

ఈ సభలో అమూల్య అనే యువతి స్టేజ్ మీదకి వచ్చి హఠాత్తుగా పాకిస్థాన్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేసింది.వేదికపై ఉన్నవారు ఆమెని వారించే ప్రయత్నం చేసిన అదే పనిగా నినాదాలు చేసింది.

ఈ ఘటనపై ఒవైసీ క్షమాపణలు చెప్పారు.తామంతా భారతీయులమని స్పష్టం చేశారు.

అయితే ఆ నినాదాలు చేసిన అమ్మాయిని పోలీసులు స్టేజ్ మీదనే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.

తాజా వార్తలు

Girl Chants Pakistan Zindabad At Owaisis Public Meeting-girl Chants Pakistan Zindabad,nrc,owaisis Public Meeting Related....