ఆ బాలికకు కంట్లోంచి నీటికి బదులుగా కారుతున్న రక్తం... అసలు ఎందుకిలా ...?!

భూమి మీద ప్రాణం ఉన్న ఏ జీవికైనా సరే ఏడిస్తే వారి కంట్లో నుంచి కేవలం నీరు మాత్రమే వస్తుంది.అయితే ఓ బాలికకు మాత్రం కంట్లో నుంచి రక్తం కారుతుంది.

 Girl In India Cries Tears Of Blood In Rare Medical Anomaly, Rare Medical Anomaly-TeluguStop.com

ఇలా రక్తం రావడం కేవలం ఏడవడం వల్ల మాత్రమే కాదు… ఆ అమ్మాయికి సంతోషం కలిగినా, మామూలుగా ఉన్న కూడా కంట్లో నుంచి రక్తం ధారాలంగా కారుతోంది.ఈ సంఘటన బ్రెజిల్ దేశంలో చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే…

బ్రెజిల్ దేశానికి చెందిన 11 సంవత్సరాల డోరిస్ అనే బాలిక అనుకోకుండా అనారోగ్యానికి గురైంది.తీవ్ర కడుపునొప్పి రావడంతో ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు.

దీంతో ఆ అమ్మాయికి వైద్యులు పరీక్షించగా ఆమె కిడ్నీలో రాళ్లున్నాయని తేల్చారు.అయితే ఆ అమ్మాయికి ఆరోగ్యం కుదుట పడిన తర్వాత ఇంటికి పంపించేశారు వైద్యులు.

అలా వెళ్లిన అమ్మాయి కొన్ని రోజుల వరకు బాగానే ఉన్న తర్వాత మరోసారి అనారోగ్యానికి గురైంది.అయితే ఈసారి ఆ అమ్మాయికి తన ఎడమ కంటి నుండి రక్తం కారడంతో ఆ అమ్మాయిని ఎమర్జెన్సీ వార్డులో చేర్చగా వైద్యులు ఆమె పరిస్థితి చూసి ఏమీ తేల్చుకోలేక పోయారు.

ఇలా రక్తం కారుతున్న సమయంలో ఆ అమ్మాయికి ఎలాంటి నొప్పి, బాధ లేకపోవడంతో వైద్యులు ఆ అమ్మాయిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు.ఇలా ఇంటికి చేరుకున్న అమ్మాయి మరో మూడు రోజులు గడిచిన తర్వాత కుడి కంటిలో నుంచి కూడా రక్తం కారడం మొదలైంది.

దీంతో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకు, ఇటు వైద్యులకు ఏం చేయాలో అంతుచిక్కడం లేదు.అయితే ఈ సమస్య సంబంధించి ప్రముఖ ఆప్తమాలజీస్ట్ రాఫెల్ ఆంటోనియా స్పందించారు.

ఇలాంటి సమస్య పేరు ‘ హెమలాక్రియా’ అని తెలియజేశారు.ఇలాంటి వారికి ప్రస్తుతం ట్రీట్మెంట్ చేయలేమని… అయితే ఇలాంటి సమస్యలు తాత్కాలికంగా మాత్రమే ఉంటాయని, కొందరికి వారి శరీర స్వభావం వల్ల కూడా ఇలా జరగవచ్చని ఆయన తెలిపారు.

అయితే ఇలాంటి సమస్య ఉన్న వారికి యాంటీబయాటిక్స్, హార్మోనల్ రెమిడీస్ సహాయంతో చికిత్స అందించవచ్చని తెలిపారు.చూడాలి మరి ఈ అమ్మాయికి ఆ సమస్యకు ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube