వైరల్ వీడియో: ఈ చిన్నారి యాక్టింగ్ కు ఆస్కార్ ఇవ్వాల్సిందే..!

ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది.ప్రపంచానికి తెలియని ఎన్నో టాలెంట్స్ ఇంటర్నెట్ వేదికగా అబ్బురపరుస్తున్నాయి.

 Little Girl Did Amazing Drama With His Brother Funny Video Goes Viral On Social Media, Little Girl, Brother, Girl Drama With Brother, Viral Video, Cute Videos, Funny Video-TeluguStop.com

ఎందరో గాయకులు, కళాకారులు కూడా దీని ద్వారా బయటపడ్డారు.ఇక ప్రస్తుతం ప్రతి చిన్న వీడియో నెట్టింట్లో తెగ హల్‏చల్ చేస్తున్నాయి.

అయితే తాజాగా నెట్టింట్లో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది.అందులో కనిపిస్తున్న చిన్నారికి సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

 Little Girl Did Amazing Drama With His Brother Funny Video Goes Viral On Social Media, Little Girl, Brother, Girl Drama With Brother, Viral Video, Cute Videos, Funny Video-వైరల్ వీడియో: ఈ చిన్నారి యాక్టింగ్ కు ఆస్కార్ ఇవ్వాల్సిందే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మామూలుగానే పిల్లలు ఏ పని చేసినా సరదాగా ఉంటుంది.వాళ్ళ మాటలు, వారి నవ్వు మనల్ని అలరిస్తుంటాయి.

వారు ఆ వయసులో తెలియక చేసే అల్లరి గురించి అసలు చెప్పలేం.అయితే, తాజాగా ఓ చిన్నారికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తెగ నవ్వుతున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో… తన అన్నయ్యతో కలిసి ఓ పాప ఆడుకుంటుంది.

అన్నయ్య దగ్గర బొమ్మ లాక్కోవడానికి ఈ పాప ప్రయత్నిస్తుంది.దీంతో ఆ పిల్లాడు ఏడుస్తూ.

ఆ బొమ్మని మాత్రం వదలకుండా గట్టిగా పట్టుకుంటాడు.దీంతో ఆ చిన్నారి పెద్ద ప్లానే వేస్తుంది.ఒక్కసారిగా పెద్దగా అరిచి వెనక్కి పడిపోతుంది.తన అన్నయ్య తనను కొట్టినట్టు తమ తల్లిదండ్రులను నమ్మించే ప్లాన్ చేసింది.ఆ తర్వాత మరోసారి కూడా అదే ప్లాన్, అదే యాక్షన్ రిపీట్ చేసింది.

ఓ కారు బొమ్మతో ఆ చిన్నారి ఆడుకోవడానికి చూస్తుండగా.

ఆ సమయంలో అక్కడకు వచ్చిన అన్నయ్య ఆ కారు బొమ్మను లాగేసుకున్నాడు.దీంతో.ఆ చిన్నారి లోని నటి ఒక్కసారిగా లేచింది.ప్లాన్ వేసి.తన అన్నయ్య కొట్టినట్టు కింద పడిపోయింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇప్పుడే ఈ చిన్నారి ఇలా నటిస్తుంటే.పెద్దయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

చిన్నారి క్యూట్ వీడియోపై మీరు ఓ లుక్కెయ్యండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube