వైరల్: నన్ను కాపీ కొట్టారో తోలుతీస్తానంటున్న జిరాఫీ... టూరిస్టులు పరుగుపరుగు!

జిరాఫీని చాలామంది సాధు జంతువు అని భ్రమపడుతూ వుంటారు.అయితే నేను సాధు జంతువుని కాదు, అవకాశమిస్తే తోలు వలిచే మృగాన్ని కూడా అని నిరూపించిందొక జిరాఫీ.

 Giraffe Attack Tourists Women Viral Video , , Zerafi, Viral Latest, News Vir-TeluguStop.com

సోషల్ మీడియా వినియోగం పెరిగాక రకరకాల కంటెంట్ వీడియోల రూపంలో మన ముందుకి వస్తోంది.అందులో కొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తే, మరికొన్ని విచిత్రంగా ఉంటాయి, ఇంకొన్ని జూపుప్సాకరంగా ఉంటాయి, కొన్ని కాస్త భయానకంగా ఉంటాయి.

ప్రస్తుతం జిరాఫీకి సంబందించిన వీడియో మాత్రం కాస్త భయంకరంగా ఉందని చెప్పుకోవచ్చు.

సాధారణంగా అడవి జంతువులను చూడాలనుకొనేవారు Zooకి వెళుతుంటారు.ఎందుకంటే అక్కడ తగినంత సేఫ్టీ ఉంటుంది.అయితే కొందరు ఔత్సాహికులు మాత్రం సరాసరి అడవుల్లోకి నేరుగా వెళ్ళిపోతూ వుంటారు.

అవును, ఇలాంటి సందర్భాలలో కొన్ని కొన్ని ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటాయి కూడా.తాము ఒకటి అనుకుంటే ఇంకొకటి అక్కడ జరుగుతుంది.

ఇలా సందర్శకులపై అడవి జంతువులు అరుదుగా దాడి చేస్తుంటాయి.ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే, ఓ మహిళా టూరిస్ట్ అడవిలో రైడ్ చేసుకుంటూ అక్కడ ఉన్న జిరాఫీని ఫోటోలు తీద్దామని ట్రై చేస్తోంది.అలా ఫొటోలు తీయడం సదరు జిరాఫీకి ససేమిరా నచ్చలేదు.దాంతో కోపంతో ఊగిపోతూ వాహనం వెనుక ఆమెని వెంబడించింది.దీంతో ఒక్కసారిగా షాక్ అయిన ఆమె.అక్కడి నుంచి తప్పించుకునేందుకు జీప్ ని స్పీడుగా ముందుకు పోనించింది.వాహనం కాస్త నెమ్మదైతే జిరాఫీ మహిళపై ఖచ్చితంగా దాడిచేసేదే.

అయితే డ్రైవర్ వాహనం వేగాన్ని పెంచి జంతువు దాడి నుంచి ఆమెని కాపాడాడు.ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube