అది నిజంగా బంగారం చెట్టా..? ఇంట్లో ఉంటే అదృష్టం వరిస్తుందా..?

మామూలుగా మనం బంగారం ఎక్కడ నుంచి వస్తుంది అంటే బంగారు గనుల నుంచి వస్తుందని టకీమని చెబుతాం.అది అందరికీ తెలిసిన విషయమే.

 Ginkgo Tree Importance, Ancient Ginkgo Tree In Japan, Tourists, Japan, Famous Tr-TeluguStop.com

అయితే మీరు ఎప్పుడైనా బంగారు చెట్టుగా పిలవబడే చెట్టును గురించి మీరు విన్నారా.? ప్రస్తుతం సోషల్ మీడియాలో బంగారు చెట్టుకు సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

జపాన్ దేశానికి చెందిన ఫోటోగ్రాఫర్ ఆ చెట్ల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఇక ఆ చెట్లకు సంబంధించి వివరాలను తెలుపుతూ.

ఆ చెట్ల వయస్సు 14 వందల సంవత్సరాల అని తెలిపాడు.అంటే మన పూర్వీకుల నాటినుండి ఈ చెట్లు జీవిస్తూనే ఉన్నాయి.

ఇకపోతే ఆ చెట్టు ఆకులు అచ్చం బంగారు రంగును కలిగి ఉంటుంది.అందుకే కాబోలు ఎవరైనా ఈ ఫోటోలను చూస్తే అది ఖచ్చితంగా బంగారం ఇచ్చే చెట్లు అని ఫిక్స్ అయిపోతారు.

కావాలంటే మీరు కూడా ఈ ఫోటోలను ఓ సారి చూసేయండి.

ఈ చెట్టు పేరు గింగో ట్రీ.

ఇది కేవలం జపాన్,చైనా దేశాలలో మాత్రమే కనబడతాయి.అయితే ఇందులో రెండు రకాల చెట్లు ఉంటాయి.

ఒకటి పూలు పూసేవి… మరొకటి పూలు పూయనవి.అయితే ఇలా పూలు పూసే చెట్లకు సంవత్సరం మొత్తంలో కేవలం రెండు వారాలు మాత్రమే వాటికి పూలు పూస్తాయి.

ఇక అలాంటి సమయంలో జపాన్ దేశానికి ఆ చెట్లను చూడటానికి ఎంతో మంది పర్యాటకులు వెళ్తుంటారు.వారితో పాటు అంతర్జాతీయంగా ఉన్న అనేక మంది ఫొటోగ్రాఫర్లు కూడా అక్కడికి చేరుకొని వాటి అందాలను వారి కెమెరాల్లో బంధించి ప్రపంచానికి తెలుపుతారు.

ఇకపోతే ఈ చెట్లు వారి ఇళ్లలో పెరిగితే చాలా అదృష్టం అని జపాన్ దేశస్థుల నమ్మకం.అయితే ఆ అదృష్టం ఎలా పడుతుందని అనుకుంటే.ఆ చెట్లను చూసినప్పుడు మనసు చాలా ఆహ్లాదంగా మారిపోతుందట.దాంతో వారి ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడటంతో తాము ఆరోగ్యంగా ఉండడమే మా అదృష్టం అంటూ అక్కడి ప్రజలు నమ్ముతారు.

అంతే కాకుండా వీటిని చూడడానికి కొంత మంది పర్యాటకులు వారి కుటుంబాలతో కలిసి వచ్చి సరదాగా గడిపి వెళుతుంటారు.అందుకే కాబోలు ఈ చెట్లకు ప్రపంచంలో కాస్త ప్రత్యేక గుర్తింపు ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube