పెరిగిపోతున్న వక్షోజాలకి అల్లంతో చెక్ పెట్టండి     2017-09-28   23:01:42  IST  Lakshmi P

చాలా మంది స్త్రీలలో వక్షోజాల పెరుగుదల..వారిని ఆందోళనకి గురిచేస్తుంది.బయటకి రావడానికి సైతం సిగ్గుపడుతూ ఇళ్లకే పరిమితమై పోయే వాళ్ళు చాలామంది ఉంటారు.ఆఫీసులకి వెళ్లాలన్నా.. కాలేజీలకు..వెళ్లాలన్నా వారు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. చివరికి 15 ఏళ్ల చిన్నారులు కూడా వక్షోజాల పెరుగుదలతో బాధపడుతున్నారు ప్రస్తుత సమాజంలో. కొవ్వు వలన వక్షోజాలు పెరుగుతాయి. ఈ సమస్యని అధిగమించడం కోసం మీరు ఇంట్లోనే చిన్న చిట్కాలతో వక్షోజాల బరువు తగ్గించుకోవచ్చు.

మనం కూరల్లో వాడే అల్లంతో వక్షోజాలలో పేరుకుపోయిన కొవ్వుని కరిగించుకోవచ్చు అని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. వక్షోజాల్లో పేరుకుపోయే కొవ్వు బ్రెస్ట్ క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అల్లం తురుమును కాగుతున్న నీటిలో మరిగించి.. ఆ నీటిని టీలా తాగాలి. ప్రతీ రోజూ తరచుగా ఇలా చేస్తుంటే రొమ్ములో పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది.

పొట్టలో పేరుకుపోయే కొవ్వు మాత్రమే కాదు, రొమ్ముల్లో పేరుకుపోయే కొవ్వు మీద దృష్టి పెట్టాలి.. అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మెటబాలిజంలో కొవ్వుని కరిగించే గుణం ఉంది..అల్లం మెటబాలిజంని వృద్ధిచేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.అందుకే అల్లంలో కొవ్వును కరిగించే పోషకాలు పుష్కలంగా ఉంటాయి.