ఎన్టీఆర్ బర్త్ డే రోజున అభిమానులకి అదిరిపోయే గిఫ్ట్..  

Gift For Fans On Ntr Birthday-movie Updates,multistarer,ntr,ntr Birthday Special,rrr Movie,ఎన్టీఆర్

ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ తన పుట్టిన రోజున అభిమానులకు ఏదో ఒక రూపం లో వాళ్ళకి మంచి ఆనందాన్ని ఇస్తున్నాడు. గతేడాది తన పుట్టిన రోజున అరవింద సమేత పోస్టర్ ఒకటి అభిమానుల కోసం విడుదల చేసారు. అది ఎన్టీఆర్ అభిమానులను ఆయన పుట్టిన రోజున మరింత ఆనందాన్ని ఇచ్చింది..

ఎన్టీఆర్ బర్త్ డే రోజున అభిమానులకి అదిరిపోయే గిఫ్ట్.. -Gift For Fans On NTR Birthday

అయితే ఈ నెల 20 వ తేదీన ఎన్టీఆర్ తన 36 వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. ప్రస్తుతం కుటుంబ సభ్యుల తో గడుపుతున్న ఎన్టీఆర్ తన పుట్టిన రోజున అభిమానులను ఒక చిన్న కానుక ఇవ్వాలని అనుకుంటున్నాడట.

రాజమౌళి దర్శకత్వం లో భారీ బడ్జెట్ తో తీస్తున్న మల్టీస్టారర్ చిత్రం #RRR , ఇందులో కొమరం భీం గా ఎన్టీఆర్ నటిస్తుండగా , అల్లూరి సీత రామ రాజు గా రామ్ చరణ్ నటిస్తున్నాడు.

ఈ సినిమా రాజమౌళి తీస్తుండడం , తెలుగు లో టాప్ స్టార్లు అయిన రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు నటిస్తుండడం తో చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటికే రెండు షెడ్యూల్ లను పూర్తి చేసుకున్న #RRR చిత్రం , ఎన్టీఆర్ కి చిన్న గాయం కారణంగా కొన్ని రోజులు షూటింగ్ కి గ్యాప్ ఇచ్చింది.

అయితే మే20 న తారక్ పుట్టిన రోజు కాబట్టి #RRR చిత్రం ఎన్టీఆర్ అభిమానులకు సప్రైజ్ ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్ లు పూర్తి చేసిన రాజమౌళి , ఎన్టీఆర్ పుట్టిన రోజున #RRR నుండి కొమరం భీం గా ఉన్న తారక్ ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతుందన్న వార్తలు వస్తున్నాయి.

ఈ వార్త నిజమైతే ఎన్టీఆర్ అభిమానులకు ఇక పండగే.