వామ్మో.. ఇంత పెద్ద ఆమ్లెట్ ని చూశారా ఎప్పుడైనా..?!

రోజురోజుకి మనిషి జీవన శైలిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.అందులో ముఖ్యంగా ఆహారానికి సంబంధించిన అలవాట్లు రోజురోజుకీ మారిపోతున్నాయి.

 Omelette Made With 60 Eggs Viral Video, Giant Omelette, 60 Eggs, Korean Country,-TeluguStop.com

గుమగుమలాడే వెరైటీ ఆహారపదార్థాలకు బాగా గిరాకీ ఏర్పడింది.ఈమధ్య కాలంలో కొందరు కాస్త ఎక్కువగా ఆలోచించి పెద్ద పెద్ద దోశలు, పూరీలు, కేకులు ఇలా వివిధ రకాల పదార్థాలను తయారు చేసి రికార్డులు సృష్టిస్తున్నారు.

అయితే తాజాగా ఇదే తరహాలో ఓ భారీ ఆమ్లెట్ ను రూపుదిద్దుకుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే కొరియా దేశం లో ఓ స్ట్రీట్ వెండర్ 60 గుడ్లతో ఓ భారీ ఆమ్లెట్ ను తయారు చేశాడు.

ఈ భారీ ఆమ్లెట్ ను తయారు చేయడానికి ఆ వ్యక్తి 60 గుడ్లను ఉపయోగించడంతో ఆమ్లెట్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఓ పెద్ద పాత్రలో 60 గుడ్లు పగులగొట్టి అందులో కొన్ని ఉల్లి పాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, కారం ఇలా ఆమ్లెట్ కు ఏదైనా అవసరమవుతాయి అన్ని కలుపుకొని సిద్ధం చేసుకున్నాడు.

ఆ తర్వాత ఓ భారీ పాన్ పై దానిని పోసి పొరలు పొరలుగా ఆమ్లెట్ ను వేశాడు.అనంతరం ఆమ్లెట్ ని ఓ పెద్ద ఇటుక గా తయారుచేసి దాన్ని ముక్కలుగా కోసాడు.

దీన్ని చూస్తుంటే నిజంగా నోరురడం మీ వంతు అవుతుంది.

అంత పెద్ద ఆమ్లెట్ ను ఒక పెద్ద ఇటుకల చుట్టి దానిని ముక్కలు ముక్కలుగా కోశాడు.ఇలా ఇలా ముక్కలుగా కోసిన వాటిని ఒక్కొక్క ఆమ్లెట్ పీస్ ను 1.7 డాలర్లకు అతను విక్రయిస్తున్నాడు.ప్రస్తుతానికి ఈ రెసిపీ కి తయారు చేసిన వీడియో పోస్ట్ తెగ వైరల్ గా మారింది.నోరూరించే ఈ భారీ ఆమ్లెట్ ను అతడు ఎలా తయారు చేశాడో చూసి మీరు కూడా ట్రై చేసి దాని రుచిని ఆస్వాదించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube