ఆకాశంలో భారీ వెలుగుతో దూసుకొచ్చిన ఉల్క.. షాకింగ్ విజువల్స్ వైరల్!

ఆకాశంలో మండిపోతున్న వస్తువులు కనిపిస్తే ఎవరికైనా సరే గుండె ఝల్లుమంటుంది.గ్రహశకలాలు వచ్చి మీద పడుతున్నాయా అని భయం వేస్తుంది.

 Giant Fireball Hovers Into The Skies Of Scotland Details, Sky,  Viral Latest, Ne-TeluguStop.com

వీటిని చూస్తూ ఉంటే కొంచెం థ్రిల్లింగ్‌గా కూడా అనిపిస్తుంది.ఈ దృశ్యాలు మానవ కంటికి నేరుగా కనిపించడం చాలా అరుదు.

అయితే ఇటీవల అలాంటి అరుదైన ఒక ఘటన యూకేలో చోటుచేసుకుంది.సెప్టెంబర్ 14న రాత్రి పూట ఒక ఫైర్‌బాల్ ఆకాశంలో కనిపించింది.

ఫైబర్ అంటే మండుతూ ఉన్న ఒక బంతి లాంటి ఆకారం.ఇది ఆకాశంలో శరవేగంగా దూసుకెళ్తూ మనుషుల కంటికి చిక్కింది.

ఈ ఫైర్‌బాల్ స్కాట్లాండ్, ఉత్తర ఇంగ్లండ్, ఐర్లాండ్ అంతటా ప్రజలకు కనిపించింది.ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి అక్కడి ప్రజలంతా ఒక్కసారిగా అబ్బురపడ్డారు.ఆ తర్వాత ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.“ఇదొక షూటింగ్ స్టార్‌ హా?? అది ఆకాశంలో క్రాష్ అవుతుందా?” అని ట్విట్టర్ యూజర్ @Rhiannon Hayes ఒక వీడియోని పంచుకున్నారు.అది కాస్తా ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది.ఈ యూజర్ ఒక్కరే కాదు చాలామంది ఈ అద్భుత దృశ్యాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

“వావ్ – ఒక ఉల్కాపాతం భూమి వాతావరణంలోకి ప్రవేశించి, గ్లాస్గోకు ఉత్తరాన, స్కాట్లాండ్ వాయువ్య తీరంలో ఎక్కడో కూలిపోయినట్లు కనిపిస్తోంది.” అని ఒక ట్విట్టర్ యూజర్ దీనిపై కామెంట్ చేశారు.నిపుణులు సైతం దీనిని చూసి ఆశ్చర్యపోయారు.

అది ఉల్కా లేక అంతరిక్ష శిథిలాలా? అని వారు కూడా సందేహం వ్యక్తం చేశారు.యూకే ఉల్కాపాతం అబ్జర్వేషన్ నెట్‌వర్క్ కూడా దీనిపై స్పందించింది.నెమ్మదిగా కదులుతోంది కాబట్టి ఈ ఫైర్‌బాల్ అంతరిక్ష శిథిలాలు అయి ఉండొచ్చని అభిప్రాయపడింది.

ఇది స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ నెట్‌వర్క్ శిథిలాలు అయి ఉండొచ్చని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.ఈ ఫైర్‌బాల్ గ్రహశకలం నుంచి విడిపోయిన ఒక చిన్న భాగం కావచ్చని ఇంకొందరు అన్నారు.

చివరకు నిపుణులు దీనిని ఒక ఉల్కగా నిర్ధారించినట్లు సమాచారం.కాగా ఇది యూకేపైన ఉన్న ఆకాశంలో ప్రయాణించిన తర్వాత అట్లాంటిక్‌లోకి దూసుకెళ్లి అక్కడ కుప్పకూలిపోయి ఉండవచ్చని తెలుస్తోంది.

ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube