నిబంధనలు పాటించని పబ్ లు, వదలని జీహెచ్ఎంసి అధికారులు  

GHMC rides on pubs -

నిబంధనలు పాటించని పబ్ లపై జీహెచ్ఎం సి అధికారులు ఉక్కుపాదం మోపారు.జూబ్లీహిల్స్,బంజారా హిల్స్ ప్రాంతాల్లో ఉన్న నిబంధనలు పాటించని పబ్ లపై కొరడా ఝళిపిస్తూ పది పబ్ లను సీజ్ చేసినట్లు తెలుస్తుంది.

Ghmc Rides On Pubs

కొన్నింటికి ట్రేడ్ లైసెన్సులు లేవు, మరికొన్నింటికి బిల్డింగ్ పర్మిషన్లు లేవు, కొన్ని అయితే పర్మిషన్లు ఒకచోట ఉంటే పబ్బులు మరోచోట కొనసాగుతున్న నేపథ్యంలో జీహెచ్ ఎం సి అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తుంది.

మొత్తం 20 మంది జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీల్లో పాల్గొని కొన్ని పబ్ లను సీజ్ చేయగా,మరికొన్నిటికి మాత్రం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.జెన్, ఫెర్టీ కేఫ్, ది పెవీలియన్, జ్యూరీ, లావింటేజ్, జీరో 40 బ్రూవింగ్, కార్బేడియన్ నైట్ క్లబ్, బ్రాడ్ వే పబ్‌లను అధికారులు సీజ్ చేయగా,

నిబంధనలు పాటించని పబ్ లు, వదలని జీహెచ్ఎంసి అధికారులు-General-Telugu-Telugu Tollywood Photo Image

నోటీసులు అందించిన పబ్ లు గనుక స్పందించకపోతే వాటిపై కూడా యాక్షన్ తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.దశల వారీగా సరైన నిబంధనలు పాటించని పబ్‌లను మూసివేస్తామని కూడా అధికారులు తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ghmc Rides On Pubs Related Telugu News,Photos/Pics,Images..