కుక్కలకూ ఓ పార్క్ ! ఎక్కడో కాదు హైదరాబాద్ లోనే  

Ghmc Started Dogs Park At Kondapur Hyderabad-

కుక్కలకు ఉన్న విశ్వాసం మనుషులకు ఉండదు అని అందరి నమ్మకం. కుక్కకు ఒకసారి అన్నం పెడితే ఎప్పటికి మర్చిపోదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కుక్కను పెంచుతున్నారు. అంతే కాదు వాటిని తమ కుటుంబ సభ్యులుగా చూసేవారు ఉన్నారు. యజమానిపై వాటికి ఉన్న విశ్వాసం మరో ప్రాణిలో అస్సలు చూడలేము. పెంచుకుంటున్న వారు తమ కుక్క ఏదైనా కారణం చేత దూరం అయితే కుటుంబ సభ్యుడు దూరం అయినట్టే బాధపడేవాళ్లు లేకపోలేదు, అంతగా మానవ జీవనంలో శునకాలు భాగం అయ్యాయి.

Ghmc Started Dogs Park At Kondapur Hyderabad-

Ghmc Started Dogs Park At Kondapur Hyderabad

కానీ వాటితో సరదాగా గడపటానికి ఇంటిలో తప్ప మరొక ప్రదేశం లేకుండా పోయింది. వాటిని తీసుకోని బయటికి వెళ్ళవచ్చు, కానీ ఇతరులకు ఇబ్బంది కలగవచ్చు. కనుక అలా కాసేపు వాటితో బయటకు వెళ్లి సరదాగా గడపటం కుదరదు. అందుకే ఈ సమస్యతో ఉన్నవారికి వెసులుబాటుగా గ్రేటర్ హైదరాబాద్ లో కుక్కల కోసమే ప్రత్యేకంగా ఒక పార్క్ ఏర్పాటు చేశారు. దానిలో శునకాలు స్వేచ్ఛగా ఉండవచ్చు. యజమానులు కూడా వాటిలో ఆ పార్కులో సరదాగా గడపవచ్చు. ఊరికే ఇంటిలోని నాలుగు గోడల మధ్య కాకుండా, ఈ పార్కుకు వచ్చి రోజంతా సరదాగా గడపవచ్చు. ఈ పార్క్ ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 వరకు అందుబాటులో ఉంటుంది.

Ghmc Started Dogs Park At Kondapur Hyderabad-

ఈ పార్కు ప్రారంభించిన రోజే చాలా మంది వారివారి శునకాలతో పార్కుకు వచ్చి సరదాగా గడపటం విశేషం. గతంలో గ్రేటర్ హైదరాబాద్ లో శునకాలకు ప్రత్యేకంగా శ్మశానం కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొండాపూర్ లోని ప్రత్యేక పార్క్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ప్రారంభించారు.