మానవత్వం చాటుకున్న జీహెచ్‌ఎంసీ మేయర్.. ఏం చేశారంటే.. ?

సాటి మనిషికి సహాయం చేయాలంటే వారు తెలిసన వారై ఉండక్కరలేదు, బంధువులు అసలే కానక్కర లేదని, చివరికి మన రాష్ట్రం వారు కూడా అవ్వాల్సిన అవసరం లేదని నిరూపించారు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు.ఆ వివరాలు చూస్తే.

 Ghmc Mayor, Gadwal Vijayalakshmi, Expressing, Humanity-TeluguStop.com

మహారాష్ట్ర కు చెందిన పాండురంగ కరాడే, నోటి కేన్సర్ తో బాధపడుతున్న తన సోదరి అయినా ఇందుబాయ్ ని చికిత్స నిమిత్తం బంజారాహిల్స్ బసవతారకం హాస్పిటల్ కు తీసుకు వచ్చారట.ఇక్కడి వైద్యులు పరీక్షించి ట్రీట్‌మెంట్ కోసం హస్పటల్‌కు 5 రోజులకు ఒకసారి రావలసి ఉంటుందని వెల్లడించారట.

అయితే అంతదూరం నుండి రావడం కష్టమని భావించిన వీరు ఆసుపత్రి సమీపంలో చెట్టు కింద ఆశ్రయం పొందుతున్నారు.ఈ క్రమంలో కూలి నాలి చేసుకొని బతికే తనకు గదిని అద్దెకు తీసుకునే స్తోమత లేదని పాండు రంగా కరాడే మీడియా ముఖంగా వెల్లడించడంతో ఈ విషయం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారి దృష్టికి వెళ్లిందట.

దీంతో విజయలక్ష్మి గారు స్పందించి అతని వద్దకు స్వయం గా వెళ్లి ఖర్చులకు కొంత నగదును సమకూర్చడమే కాదు, హాస్పిటల్ డైరెక్టర్ టీ ఎస్ రావు గారితో మాట్లాడి అతనికి ఆసుపత్రి లో ఉచితంగా ట్రీట్మెంట్ తో పాటుగా గది ఇప్పించాలని ఆదేశించారట.ఇంకేముంది మేయర్ ఆదేశాలతో వారికి కావలసిన సౌఖర్యాలు సమకూరాయట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube