జీహెచ్‌ఎంసీ లాక్‌డౌన్‌ అయితే షూటింగ్స్‌ సాగేనా?  

Ghmc Lockdown Movie Shootings - Telugu Corona Effect, Ghmc Lockdown, Lockdown, Serial Shootings, Will Shootings Continue

తెలంగాణ ప్రభుత్వం మళ్లీ లాక్‌ డౌన్‌ గురించి ఆలోచిస్తుంది అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.జీహెచ్‌ఎంసీ పరిధిలో గత వారం రోజులుగా విపరీతంగా కేసులు పెరిగి పోతున్నాయి.

 Ghmc Lockdown Movie Shootings

ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ వరకు లాక్‌డౌన్‌ను అమలు చేయాలని నిర్ణయించారు.అధికారికంగా ఈ విషయంపై త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

లాక్‌డౌన్‌ మళ్లీ అమలు చేస్తే షూటింగ్స్‌ పరిస్థితి ఏంటీ అంటూ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.

జీహెచ్‌ఎంసీ లాక్‌డౌన్‌ అయితే షూటింగ్స్‌ సాగేనా-Movie-Telugu Tollywood Photo Image

షూటింగ్స్‌పై అధికారికంగా ప్రభుత్వం నిషేదం ఉండకున్నా కూడా లాక్‌ డౌన్‌ పరిస్థితుల్లో షూటింగ్‌ కంటిన్యూ చేయడం సాధ్యం అయ్యే పని కాదు.

కనుక మళ్లీ షూటింగ్స్‌ నూటికి నూరు శాతం ఆగకున్నా ఎక్కువ శాతం మంది షూటింగ్స్‌ ఆగిపోయే అవకాశం ఉంది. బుల్లి తెరపై ఈమద్య సందడి మొదలైంది.

ఇలాంటి సమయంలో మళ్లీ షూటింగ్స్‌ ఆపేస్తే పరిస్థితి ఏంటీ అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.

పరిస్థితులు ఇలా ఉంటాయేమో అనే ఉద్దేశ్యంతోనే చాలా సినిమాల షూటింగ్స్‌ ప్రారంభం కాలేదు.కోట్లు ఖర్చు పెట్టి మళ్లీ షూటింగ్‌ మొదలు పెట్టడం మళ్లీ కొన్ని రోజులకే ఆపేయడం చేస్తే నిర్మాతలకు చాలా నష్టం అందుకే పరిస్థితులు సర్దుమనిగిన తర్వాతే షూటింగ్స్‌ పున: ప్రారంభించాలని అనుకున్నారు.జులై 15 వరకు లాక్‌ డౌన్‌ విధిస్తే ప్రభుత్వం ఆ సమయంలోనే షూటింగ్స్‌ విషయంలోనూ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

టీవీ వర్గాల వారికి కూడా పాజిటివ్‌ వచ్చిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ghmc Lockdown Movie Shootings Related Telugu News,Photos/Pics,Images..

footer-test