గ్రేటర్ లో బీజేపీ టీడీపీ పొత్తు ?   

GHMC election effect bjp trying on TDP aliance, Chandrababu Naidu, TDP, BJP, TRS, GHMC Elections, KCR - Telugu Bandi Sanjay, Bjp, Chandrababu, Congress, Ghmc Elections, Greater Hyderabad, Kcr, Ktr, Tdp, Trs

ఎప్పటి నుంచో బిజెపితో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు.ఏదో రకంగా ఆ పార్టీకి దగ్గర అవ్వాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

TeluguStop.com - Ghmc Election Effect Bjp Trying On Tdp Aliance

అయినా బిజెపి పెద్దల దయాదాక్షిణ్యాలు బాబుకి కలగడం లేదు.వారు ఎంతగా దూరం పెడదామని చూస్తున్నా,  బాబు మాత్రం వారికి దగ్గర అయ్యేందుకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు.

అయితే గతంలో టిడిపి, బిజెపి పార్టీల మధ్య పొత్తు ఉన్న సమయంలో బిజెపితో టిడిపి  వ్యవహరించిన తీరు పైన, బీజేపీ నేతలు చాలా కాలంగా ఆగ్రహంగా ఉంటూనే వస్తున్నారు.అయినా బాబు మాత్రం తనకున్న పాత పరిచయాలతో బిజెపికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తూనే, అప్పుడప్పుడు కేంద్ర బిజెపి పెద్దలకు ఫోన్ ద్వారా పరామర్శలు చేస్తూ, చాలా కాలంగా వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
 అయితే బాబుని అప్పటి నుంచి దూరం పెడుతూ వస్తున్న బీజేపీ పెద్దలకు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి అవసరం వచ్చినట్లుగా కనిపిస్తోంది.ఎందుకంటే గ్రేటర్ పరిధిలోని సుమారు 50 డివిజన్లలో టిడిపికి పట్టు ఎక్కువగా ఉండడంతో,  ఇప్పుడు బీజేపీ నే స్వయంగా టిడిపితో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో , టిడిపిలో జోష్ కనిపిస్తోంది .ఏదో రకంగా గ్రేటర్ లో బీజేపీ జెండా ఎగురవేయాలని చూస్తున్న బీజేపీకి టిడిపి బలం ఏమిటో ఇప్పుడు స్పష్టంగా తెలిసి వచ్చింది.ఎందుకంటే గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలోని సుమారు 50 డివిజన్ లలో టిడిపికి బలం ఉంది.

TeluguStop.com - గ్రేటర్ లో బీజేపీ టీడీపీ పొత్తు  -General-Telugu-Telugu Tollywood Photo Image

ఆ బలం తోనే గేటర్ లో గట్టెక్కాలి అని చూస్తోంది.బిజెపి ఓటు బ్యాంకు తో పాటు, తెలుగుదేశం పార్టీ బలం దానికి తోడైతే, టిఆర్ఎస్ ను ఇక్కడ ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు అనే విషయం బీజేపీ నేతలు గుర్తించి , ఈ మేరకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ టీడీపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ పరిణామాలు టిడిపిలో మంచి హుషారుగా కలిగిస్తున్నాయి.బిజెపి నేతలు తమంతట తాముగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు వస్తుండడం, గ్రేటర్ పరిధి వరకే పొత్తు ఉంటుందని చెప్పినా, ముందు ముందు ఏపీలోనూ పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తుండడం, ఇవన్నీ తెలుగుదేశం పార్టీలో ఆనందం కలిగిస్తున్నాయి.అయితే అధికారికంగా ఇంకా పొత్తు విషయంలో క్లారిటీ రాకపోయినా, ఈ రెండు పార్టీల మధ్య చోటు చేసుకుంటున్న వ్యవహారం చూస్తుంటే , ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ,  రెండు పార్టీలు పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి అనే విషయం అర్ధం అవుతోంది.ఇప్పటికే తెలంగాణ టిడిపి అధ్యక్షుడు రమణ కు బీజేపీ నుంచి సంకేతాలు వచ్చినట్లు తెలుస్తోంది .ఈ వ్యవహారంపై చంద్రబాబు సైతం ఆసక్తి గా ఉండడం , తక్కువ స్థానాల్లో టీడీపీకి అవకాశం కల్పించినా బీజేపీ కి మద్దతు ఇవ్వాలనే అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

#Chandrababu #Congress #Bandi Sanjay #GHMC Elections

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ghmc Election Effect Bjp Trying On Tdp Aliance Related Telugu News,Photos/Pics,Images..