నోటి పూతను సులువుగా త‌గ్గించే నెయ్యి.. ఎలాగంటే?

నోటి పూత. దీనినే మౌత్ అల్స‌ర్ అని కూడా అంటారు.

 Ghee Helps To Reduce Mouth Ulcer Ghee, Reduce Mouth Ulcer, Mouth Ulcer,home Redi-TeluguStop.com

నోట్లో చిన్న చిన్న పుండ్లు రావ‌డ‌మే నోటి పూత‌.చిన్న‌, పెద్ద అనే తేడా లేకుండా చాలా మందిలో కామ‌న్‌గా నోటి పూత స‌మ‌స్య క‌నిపిస్తుంటుంది.

నోటి పూత చిన్న స‌మ‌స్యే అయిన‌ప్ప‌టికీ.నొప్పి మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది.

నొప్పి పూత వ‌చ్చిందంటే స‌రిగ్గా భోజ‌నం చేయ‌లేరు.కొంచెం కారం, పులుపు, ఉప్పు తగిలినా సరే జివ్వుమంటుంది.

నీళ్లు తాగడం కూడా ఒక్కో సారి కష్టంగా ఉంటోంది.

అయితే వాస్త‌వానికి క‌డుపులో ఏదైనా తేడా చేసినా, జీర్ణ వ్య‌వ‌స్థ స‌రిగ్గా లేక‌పోయినా, నోటిని శుభ్రంగా ఉంచుకోక‌పోయినా, విట‌మిన్ల లోపం ఏర్ప‌డినా నోటి పూత ఏర్ప‌డుతుంది.

ఇక నోటి పూత‌ను త‌గ్గించుకునేందుకు చాలా మంది మందులు వాడ‌టం లేదా మౌత్ వాషులు వాడ‌టం చేస్తుంటారు.కానీ, న్యాచుర‌ల్‌గా కూడా నోటి పూత‌ను నివారించుకోవ‌చ్చు.

ముఖ్యంగా ఎన్నో పోష‌క విలువ‌లు దాగి ఉంటే నెయ్యి.నోటి పూత‌ను త‌గ్గించ‌డంలో ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.

అవును, ప్ర‌తి రోజు రాత్రి నిద్రించే ముందు నోటి కాస్త శుభ్రం చేసుకుని.ఆ త‌ర్వాత ఎక్క‌డైతే పుండ్లు ఉన్నాయో ఆ ప్రాంతంలో నెయ్యిని అప్లై చేయాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల చాలా సులువుగా నోటి పూత త‌గ్గుముఖం ప‌డుతుంది.నెయ్యిని ఇలా అప్లై చేయ‌డంలో పాటు మ‌రికొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే.

మ‌రింత త్వ‌ర‌గా నోటి పూతని నివారించుకోవ‌చ్చు.

నోటి పూత ఏర్ప‌డిన‌ప్పుడు పులుపు, కారం, ఉప్పు మసాలాలు దగ్గరికి రానివ్వకండి.

నోటి పూత ఏర్ప‌డిన‌ప్పుడు త్వ‌ర‌గా జీర్ణం అయ్యే ఆహారాలానే తీసుకోవాలి.ఎక్కువ‌గా వాట‌ర్‌ను తీసుకోవాలి.

ఇక నోటి పూత ను నివారించ‌డంలో అర‌టి పండు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.కాబ‌ట్టి, నోటి పూత వ‌చ్చిన‌ప్పుడు క‌చ్చితంగా రోజుకో అర‌టి పండును తీసుకోవాలి.

అలాగే ఐరన్‌, విటమిన్ బి పుష్కంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube