నెయ్యిలో ఇవి క‌లిపి రాస్తే..వృద్ధాప్య ఛాయ‌లు దూరం?

వ‌య‌సు పెరిగే కొద్ది వృద్ధాప్య ఛాయ‌లు క‌నిపించ‌డం స‌ర్వ సాధార‌ణం.ముఖ్యంగా నాల‌బై ఏళ్లు వ‌చ్చాయంటే చాలు.

 Ghee Helps To Get Rid Of Ageing Process-TeluguStop.com

య‌వ్వ‌నం త‌గ్గి చ‌ర్మంపై ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌లు ఏర్ప‌డుతుంటారు.అయితే వ‌య‌సును ఎలాగో త‌గ్గించుకోలేము.

కానీ, కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే వృద్ధాప్య ఛాయ‌లను దాచేసి.నాల‌బైలోనూ ఇర‌వై ఏళ్ల మాదిరిగా క‌నిపించ‌వ‌చ్చు.

 Ghee Helps To Get Rid Of Ageing Process-నెయ్యిలో ఇవి క‌లిపి రాస్తే..వృద్ధాప్య ఛాయ‌లు దూరం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకు నెయ్యి అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.వంట‌ల‌కు నెయ్యి ఎంత మంచి రుచిని అందిస్తుందో అంత‌కంటా ఎక్కువే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

అలాగే చ‌ర్మ సంక్ష‌ణ‌లోనూ నెయ్యి ఉప‌యోగ‌ప‌డుతుంది.మ‌రి నెయ్యిని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు స్పూన్ల నెయ్యి, అర‌ స్పూన్ గ్లిజరిన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు మ‌రియు చేతుల‌కు అప్లై చేసి కాసేపు మ‌సాజ్ చేసుకోవాలి.

డ్రై అయిన త‌ర్వాత కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకుని ట‌వ‌ల్‌తో తుడుచుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే వృద్ధాప్య ఛాయ‌లు దూర‌మై.

చ‌ర్మం య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మెరుస్తుంది.

Telugu Ageing Process, Beauty, Beauty Tips, Benefits Of Ghee, Face Packs, Ghee, Ghee For Skin, Latest News, Skin Care-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

అలాగే మూడు స్పూన్ల నెయ్యిలో ఒక స్పూన్ బాదం నూనె వేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి అప్లై చేసి.ఐదు నుంచి ప‌ది నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి.

బాగా ఆరిన త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేసినా ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌లు త‌గ్గి.

చ‌ర్మం య‌వ్వ‌నంగా మారుతుంది.

ఈ టిప్స్ పాటించ‌డంతో పాటు ప్ర‌తి రోజు ఏదో ఒక రూపంలో స్పూన్ నెయ్యి తీసుకోవాలి.

నెయ్యితో పాటు డైట్‌లో తృణ ధాన్యాలు, పాలు, బీన్స్, వాల్ న‌ట్స్‌, వేరు శెన‌గ‌లు, గ్రీన్ టీ, జామ ప‌ళ్లు, బొప్పాయి, కివి పండు వంటివి చేర్చుకోవాలి.ఎందుకంటే ఈ ఆహారాలు వృద్ధాప్య ఛాయ‌లను నివారించ‌డంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

ఇక వాట‌ర్ ఎక్కువ‌గా తీసుకోవ‌డంతో పాటు కంటి నిండా నిద్ర పోవాలి.లేదంటే ఎన్ని చేసినా ఫ‌లితం ఉండ‌దు.

#Ghee For Skin #Ageing Process #Beauty Tips #Skin Care #Face Packs

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు