దానం నాగేందర్ ను సాగనంపుతారా ?

దానం నాగేందర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు.ఆయన మాజీ మంత్రి.

 Danam Nagender Under Congress Scrutiny-TeluguStop.com

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాదు కాంగ్రెస్ అధ్యక్షుడు.కానీ చాలా కాలంగా ఆయన వాయిసే ఎక్కడా వినబడటం లేదు.

పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కనబడటం లేదు.ఉద్దేశపూర్వకంగానే పార్టీకి దూరంగా ఉంటున్నారు.

ఉత్తమ కుమార్ రెడ్డిని తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడిని చేసిన తరువాత దానం తనకు తానై కనుమరుగు అయిపోయారు.దీంతో కొంతకాలం కిందట పార్టీ ఈయనకు అల్టిమేటం పంపింది.

కానీ స్పందన లేదు.దీంతో పార్టీ నుంచి బయటకు పంపాలని అంటే డిస్మిస్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

రేపు (గురువారం ) పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరగబోతున్నది.దానికి హాజరు కావాలని దానంకు కబురు పంపారు.

కానీ ఆయన రాక పోవచ్చని అనుకుంటున్నారు.పార్టీ నుంచి డిస్మిస్ చేయాలనే దానం కోరుకుంటున్నారని, దీన్ని తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

తానూ ఎటువంటి తప్పు చేయక పోయినా తనను బలవంతంగా పార్టీ నుంచి పంపించివేసారని ప్రచారం చేసుకొని సానుభూతి పొందవచ్చు.పార్టీ నుంచి బయటకు వచ్చాక అందరి మాదిరిగానే గులాబీ పార్టీలోకి వెళతారేమో.

దానం ఏదో పెద్ద ప్లాను తోనే పార్టీకి దూరంగా ఉండొచ్చు.రేపు సమావేశంలో పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube