షూటింగ్ మొదలైంది.. కానీ ఈ సినిమాలు ఆగిపోయాయ్?

సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నా అదృష్టం మాత్రం కలిసి రావాలి.ఎందుకంటే బడా బ్యాక్ గ్రౌండ్ లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ కేవలం సక్సెస్ మాత్రమే కెరియర్ను నిర్ణయిస్తూ ఉంటుంది.

 Ghattamanei Ramesh Babu And Super Star Krishna Aho Vikramarka Halted Movie Detai-TeluguStop.com

సక్సెస్ సాధిస్తే సాధారణ హీరో స్టార్ హీరో గా మారిపోతాడు.ఇక సక్సెస్ లేకపోతే స్టార్ హీరో సైతం అవకాశాలు లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు.

ఇలా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ లేక చివరికి అన్నీ సర్దుకొని మళ్ళీ తిరిగి ఇంటి దారి పట్టిన వారు చాలా మంది ఉన్నారు.హీరోగా కల నెరవేర్చుకోవాలని అనుకుని సినిమాలు తెరకెక్కించిన తర్వాత చివరికి వివిధ కారణాలతో ఆగిపోయి షాక్ తగిలిన వారు చాలా మంది ఉన్నారు.

ఇలాంటి వారిలో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు కూడా ఒకరు.

సూపర్ స్టార్ కృష్ణ లాంటి భారీ బ్యాక్ గ్రౌండ్.

ఇండస్ట్రీ లోకి రావాలంటే ఇంతకంటే ఇంకేం కావాలి.చైల్డ్ ఆర్టిస్ట్గా అప్పటికే కెమెరా ముందు నటించిన అనుభవం.

భయం బెరుకు లేకుండానే రమేష్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు.హీరోగా మాత్రం సక్సెస్ కాలేకపోయారు.

ఇక తన వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రమేష్ బాబును హీరోగా నిలబెట్టెందుకు కృష్ణ చేయని ప్రయత్నం లేదు.ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ డైరెక్టర్లు అందరూ కూడా రమేష్ బాబు తో సినిమా చేశారు.

అయినప్పటికీ అతనికి సక్సెస్ మాత్రం దొరకలేదు.ఇలాంటి క్రమంలోనే రమేష్ బాబు హీరోగా భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఒక సినిమా మాత్రం ఆర్థిక సమస్యల కారణంగా చివరికి విడుదలకు నోచుకోలేదు.

Telugu Aho Vikramarka, Mahesh Babu, Maheshbabu, Ramesh Babu, Krishna-Movie

సూపర్ స్టార్ కృష్ణ ఆయన వారసుడు రమేష్ బాబు హీరోలుగా 1996లో ఆహో విక్రమార్క అనే ఒక సినిమా షూటింగ్ ప్రారంభం అయింది.ఈ సినిమాకు సాగర్ దర్శకత్వం వహించారు.ఇక భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా ఆర్థిక సమస్యల కారణంగా అర్ధంతరంగా ఆగిపోయింది.ఇప్పుడు పరిశ్రమలో ఉన్న ఎంతోమంది దిగ్గజ నటులతో ఈ సినిమా తెరకెక్కింది.

Telugu Aho Vikramarka, Mahesh Babu, Maheshbabu, Ramesh Babu, Krishna-Movie

ఈ సినిమాతో కృష్ణ కొడుకు రమేష్ బాబు మంచి విజయం సాధిస్తాడు అనుకున్నారు పరిస్థితులు అనుకూలించక ఈ సినిమా ఆగిపోయింది.అంతేకాదు రమేష్ బాబు కెరీర్లో మొదటి జానపద చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది.తరువాత 1996లో మరో జానపద చిత్రం భూలోక రంభ ఇలాగే అర్ధాంతరంగా ఆగిపోయింది.రంభ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రారంభమై చివరికి షూటింగ్ నిలిచిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube