మొసలిని అమాంతం మింగేసిన కొండచిలువ

అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు చూడగానే ఆశ్చర్యానికి గురి చేస్తాయి.వాస్తవంగా చూస్తే అది ఎలా సాధ్యం అనే విషయం పక్కన పెడితే చూసే వారికి మాత్రం భయం కలిగిస్తుంది.

 Ghastly Pics Show Huge Python Swallowing Crocodile Whole-TeluguStop.com

తాజాగా అలాంటి ఘటన ఆస్ట్రేలియాలో క్వీన్ లాండ్ లో చోటు చేసుకుంది.చూడటానికి సన్నగా ఉన్న ఓ కొండ చిలువ అమాంతం ఓ మొసలిని మింగేసింది.

కొలను వద్ద సేద తీరుతున్న మొసలిని కనిపెట్టిన ఆ కొండచిలువ మెల్లగా దాని దగ్గరకి వెళ్ళింది.

నీటిలోకి ఎలాంటి ప్రాణి వచ్చిన అమాంతం పట్టేసే మొసలిని కొండ చిలువ ఊహించని విధంగా పట్టుకొని మింగేసింది.

ఇక ఈ కొండ చిలువ ఆ జాతులలో ఉంటే అతి భయంకరమైన ఆలివ్ పైథాన్‌ అని తెలుస్తుంది.సుమారు 13 అడుగుల పొడవు వరకు పెరుగే ఇవి మనిషితో పాటు ఎంత పెద్ద జంతువుని అయిన క్షణాలలో మింగేస్తుంది అని తెలుస్తుంది.

అలాగే మొసలిని కూడా కొండ చిలువ మింగేసింది.ఈ దృశ్యాలని మార్టిన్ ముల్లర్ అనే వ్యక్తి ఫోటోలు తీయగా, ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఆర్గనైజేషన్ జీజీ వైల్డ్ లైఫ్ రెస్క్యూ ఫేస్‌బుక్ లో షేర్ చేయడంతో ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube