ఘరానా దొంగలు: ఏకంగా 58 అడుగుల బ్రిడ్జినే దొంగలించారుగా..!

మీరు డబ్బులు, నగలు, లేదంటే ఇంట్లో ఉన్న విలువైన సామాగ్రిని దొంగిలించే దొంగల గురించి వినే ఉంటారు.కానీ ఇటువంటి దొంగల గురించి మీరు ఎన్నడూ విని ఉండరు.

 Gharana Thieves: A 58-foot Bridge Was Looted In One Fell Swoop 58 Feet, Bridge,-TeluguStop.com

ఎందుకంటే ఈ దొంగలు అందరి దొంగల్లాగా కాదు.ఘరానా దొంగలు.

ఏకంగా వీళ్ళు ఒక భారీ వంతెనని అలవోకగా రాత్రికి రాత్రే ఎవ్వరికి తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా దొంగలించేసారు మరి.అసలు వంతెనను దొంగిలించడం ఏంటి అని షాక్ అవుతున్నారా.?! కానీ ఇది నిజంగానే జరిగిన ఘటన.ఈ ఘటన గురించి తెలిసి స్థానికులతో పాటు పోలీసు యంత్రాంగం కూడా షాక్ లో ఉండిపోయింది.అసలు దొంగలు ఓ బ్రిడ్జీని ఎత్తుకుపోవడం ఏంటి అనే ప్రశ్న అందరిలో మెదులుతుంది.అదికూడా చిన్న చితకా బ్రిడ్జి కాదండోయ్ ఏకంగా 58 అడుగుల పొడవైన బ్రిడ్జీ.

ఈ విచిత్రమైన ఘటన ఒహియాలోని స్మాల్ అక్రాన్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

ఈస్ట్ అక్రాన్ లోని ఒక కాలువపై పాలీమర్‌ తో నిర్మించిన వంతెన నవంబరు 3వ తేదీన కనిపించకుండా పోయింది.

పొద్దున లేచి గ్రామస్థులు చూసేసరికి ఆ వంతెనకు ఉన్న డెక్‌ కనిపించకపోవటంతో గ్రామస్థులు ఆశ్చర్యపోయారు.ఏంటీ వంతెన కనిపించడం లేదు.? గత వారం రోజుల క్రితం ఉన్న వంతెన సడెన్ గా మాయం అయ్యేసరికి గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు.గ్రామస్థులు చెప్పిన మాటలు విన్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి చూడగా నిజంగానే అక్కడ ఫుట్ బ్రిడ్జ్ ఉన్న ఆనవాళ్లు అయితే ఉన్నాయి గానీ వంతెన మాత్రం లేదు.

పెద్ద పెద్ద భారీ క్రేన్లతో నిర్మించిన వంతెన రాత్రికి రాత్రే ఎలా మాయం అయిందని పోలీసులు సైతం షాక్ అయ్యారు.దాదాపు 10 అడుగుల వెడల్పు, 6 అడుగుల ఎత్తు, 58 అడుగుల పొడవు ఉండే ఆ వంతెన దొంగిలించడం అంటే మాటలు కాదు.

వంతెనను పెగిలించడానికి భారీ క్రేన్లు అవసరమవుతాయి.కానీ అవేమి దొంగలు వాడిన ఆనవాళ్లు లేవు.

Telugu Feet, Bridge, Latest, Theft-Latest News - Telugu

అసలు చిన్నచప్పుడు కూడా లేకుండా ఎంతో చాకచక్యంతో ఆ వంతెనను ఎలా దొంగిలించారనేది పోలీసులను వేధించే ప్రశ్నగా మారింది.ఒకవేళ వారు ఆ వంతెనను ముక్కలుగా చేసి ఎత్తుకెళ్లిపోయారేమో అని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ వంతెన దొంగతనంపై ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ నా 22 ఏళ్ల సర్వీసులో నేను ఎప్పుడూ ఇటువంటి దొంగతనాన్ని చూడలేదు, వినలేదని తెలిపారు.ఈ వింత చోరీ కేసు మిస్టరీని ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని దొంగలను పట్టుకుంటామని స్పష్టం చేశారు.నిజానికి ఆ వంతెన విలువ సుమారు 30.44 లక్షలు ఉంటుందని తెలిపారు.అయితే దొంగలకు తెలియని ఒక ట్విస్ట్ ఏంటంటే.ఆ వంతెనను పాలిమర్‌తో తయారు చేయడం వలన దాన్ని అమ్మినా గాని డబ్బులు రావు.అలాగని రీసైక్లింగ్ చేసినా మళ్లీ ఉపయోగించడం కూడా సాధ్యం కాదు.పాపం ఎంతో కష్టపడి వంతెనను దొంగతనం చేసిన ఆ దొంగలకు ఈ విషయం తెలుసో లేదో మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube