ఘంటసాల కు ఎన్నారైల ఘననివాళి...ఏడాది పాటు..ప్రతి రోజు...!!!

ప్రఖ్యాత గాయకుడు, పద్మశ్రీ ఘంటసాల గారి శత జయంతి సందర్భంగా తెలుగు ఎన్నారైలకు చెందిన పలు సంస్థలు ఓ గొప్ప మహోద్యమానికి శ్రీకారం చుట్టాయి.ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, వంగూరి ఫౌండేషన్, సింగపూర్ లోని శ్రీ సాంస్కృతిక కళాసారధి, శుభోదయం, వంశీ ఇంటర్నేషనల్ వంటి ప్రఖ్యాత సంస్థల ఆధ్వర్యంలో దాదాపు 365 రోజుల పాటు నిర్విరామంగా ఘంటసాల స్వర రాగ మహా యాగాన్ని వర్చువల్ గా ఏర్పాటు చేసి ఘనంగా ప్రారంభించారు.

 Ghantasala Swara Raga Mahayagam Held  365days, Ghantasala,  Ghantasala Maha Yaga-TeluguStop.com

ఈ పాటల మహోద్యమానికి ఘంటసాల సతీమణి, కుమార్తెలు పాల్గొన్నారు.ఘంటసాల పాడిన పాటలు తెలుగు ప్రజలకు ఎలాంటి ఊరడింపు ఇచ్చాయి, ఆయన గానామృతంతో స్వర సంగీతానికి చేసిన విశేష కృషిని పలువురు సినీ పెద్దలు, రచయితలు , సంగీత దర్శకులు కొనియాడారు.

ఘంటసాల కుమార్తెలు, ప్రార్ధనా గీతం ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.వంగూరి ఫౌండేషన్ ఛైర్మన్ జగన్ మోహన్ రావు మొదలగువారు ఘంటసాల సంగీత ప్రపంచానికి చేసిన సేవలను కొనియాడారు.డిసెంబర్ 4 .2021 న మొదలైన ఈ గానామృతం వచ్చే ఏడాది

Telugu Ghantasala, Ghantasalamaha, Ghantasalaswara, Nri Telugu, Nris, Vanguri-Te

డిసెంబర్ -4-2022 వరకూ కొనసాగుతుందని ప్రతీ రోజు సుమారు గంట పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గాయనీ గాయకులు ఈ ఘంటసాల పాటలను వినిపిస్తారని, రచయితలు ఘంటసాల పై రచనలు చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమం ముగింపు వేడుకలను సింగపూర్ లో ఏర్పాటు చేయనున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు.

భారత కాలమానం ప్రకారం ప్రతీ శని , ఆది వారాలలో ఉదయం 10 గంటలకు అలాగే సోమవారం నుంచీ శుక్రవారం వరకూ రాత్రి 9 గంటల సమయంలో ప్రసారం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని అనుకునే ప్రతీ ఒక్కరూ శుభోదయం మీడియా, వంశీ ఆర్ట్ థియేటర్స్ వారి యూట్యూబ్ లో లైవ్ లో వీక్షించవచ్చునని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube