నాన్నపేరు పాడవుతుందని ఆ విషయాలు చెప్పలేదు.. ఘంటసాల కొడుకు కామెంట్స్ వైరల్!

సంగీత దర్శకుడిగా, నేపథ్య గాయకుడిగా తెలుగు సినిమాల ద్వారా ఘంటసాల వెంకటేశ్వరరావు గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.తొలి తరం నేపథ్య గాయకులలో ఘంటసాల ఒకరు కాగా బాల్యంలో ఘంటసాల పాటలు పాడుతూ డ్యాన్స్ చేసేవారు.

 Ghantasala Son Ravi Interesting Comments About His Father, Ghantasala,ghantasala-TeluguStop.com

అందరూ ఘంటసాలను బాల భరతుడు అని పిలిచేవారు.చివరిరోజుల్లో ఘంటసాల తండ్రి ఘంటసాలను గొప్ప సంగీత విద్వాంసుడు కావాలని కోరారు.

తండ్రి చివరి కోరికను నెరవేర్చాలనే ఆలోచనతో ఘంటసాల మొదట గురుకులాలలో చేరారు.అయితే అక్కడి నియమనిబంధనలు కఠినంగా ఉండటంతో తెలిసిన సంగీత విద్వాంసుల దగ్గర చేరారు.

పట్రాయని సీతారామశాస్త్రి ఘంటసాలకు సంగీతంలో శిక్షణ ఇచ్చారు.ఆ తర్వాత కళాశాలలో చేరి నాలుగు సంవత్సరాల కోర్సును ఘంటసాల కేవలం రెండు సంవత్సరాలలో పూర్తి చేశారు.

Telugu Ghantasala, Ghantasalaravi, Ghantasalason, Ravi-Movie

స్వర్గసీమ సినిమాకు నేపథ్య గాయకుడిగా పని చేసి 116 రూపాయలను ఘంటసాల పారితోషికంగా తీసుకున్నారు.పాతాళ భైరవి సక్సెస్ తో ఘంటసాలకు మంచి పేరు వచ్చింది.రెండో భార్య సరళాదేవి వల్లే ఘంటసాల ఆర్థిక ఇబ్బందులు పడ్డారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.అయితే ఘంటసాల రెండో భార్య కుమారుడు రవి ఒక ఇంటర్వ్యూలో నాన్న మరణం తర్వాత పరిస్థితులు మారిపోయాయని అన్నారు.

నాన్న చనిపోయిన తర్వాత అమ్మ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చాయని అయితే ఆ సమయంలో అమ్మ ఒక్కరిని కూడా ఒక్క మాట అనలేదని రవి వెల్లడించారు.అమ్మ మాట్లాడితే నాన్న పేరు పాడవుతుందని భావించామని ఘంటసాల పిల్లలు వీధికెక్కారనే అపవాదు రాకూడదని మౌనంగా ఉన్నామని రవి తెలిపారు.

ఆ తర్వాత తాను మద్రాస్ లోని దూరదర్శన్ లో చేరానని పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా భరించామని రవి అన్నారు.ఇండస్ట్రీలోని పెద్ద హీరోలకు మా గురించి తెలిసినా తెలియనట్టు నటించేవారని రవి అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube