మధురగానంతో ఘంటసాల వెంకటేశ్వరరావు ( Ghantasala Venkateswara Rao )చాలామంది ప్రేక్షకుల హృదయాలను చేశారు.సంగీత ప్రియులు ఇప్పటికీ ఆయన పాడిన పాటలు వింటూ మైమరిచిపోతుంటారు.
ఈ గానగంధర్వుడు తక్కువ వయసులో చనిపోయినా తన పాటల ద్వారా ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు వారి గుండెల్లో నిలిచిపోతారు.గాన మాధర్యంతో చిరస్మరణీయమైన పాటలు పాడిన ఈ మెలోడీ బ్రహ్మ వర్ధంతి నేడు.
ఆయన ఫిబ్రవరి 11న తనువు చాలించారు.ఈ సందర్భంగా ఏ నేపథ్య గాయకుడి గురించి ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం.
1922, డిసెంబరు 4న చౌటపల్లి గ్రామంలో సూర్యనారాయణ, రత్నమ్మ ( Suryanarayana, Ratnamma )దంపతులకు ఘంటసాల వెంకటేశ్వరావు జన్మించారు.ఘంటసాల తండ్రి గొప్ప సంగీత విద్వాంసులు.
తండ్రి నుంచి మృదంగం ఎలా వాయించాలో ఘంటసాల తెలుసుకున్నారు.తండ్రి ప్రోత్సాహంతో డ్యాన్స్ కూడా నేర్చుకున్నారు.
కొన్ని నాట్య ప్రదర్శనలు కూడా ఇచ్చి చాలామందిని ఆకట్టుకున్నారు.ఘంటసాల తండ్రికి మాట ఇచ్చిన ప్రకారం జీవితాన్ని సంగీతానికే అంకితం చేశారు.
శాస్త్రీయ సంగీతం( Classical music ) నేర్చుకోవడానికి గుడివాడ నుంచి విజయనగరం వచ్చి అక్కడ ఓ కాలేజీలో చేరారు.

కాలేజీలో చిన్న గొడవ వల్ల ఘంటసాలను బహిష్కరిస్తే అదే కాలేజీలో గాత్ర పండితులుగా పనిచేస్తున్న పట్రాయని సీతారామశాస్త్రి ( Patrayani Sitarama Shastri )ఆయన్ని చేరదీశారు.ఆయన దగ్గరే సంగీతం గురించి ఎన్నో విషయాలను ఘంటసాల తెలుసుకున్నారు.కొద్ది రోజులకు మళ్లీ అదే కాలేజీలో చేరి నాలుగేళ్ల మ్యూజిక్ కోర్సుని రెండేళ్లలో కంప్లీట్ చేశారు.అదే సమయంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండేళ్లు జైలుకు కూడా వెళ్లారు.1944లో మేనకోడలు సావిత్రితో ఘంటసాల పెళ్లి జరిగింది.అప్పటినుంచి తనని, తన భార్యను పోషించేందుకు సంగీత కచేరీలు చేయడం ప్రారంభించారు.ఊరూరా తిరుగుతూ కచేరీలు చేస్తూ ప్రముఖ సంగీత దర్శకుడు సముద్రాల రాఘవాచార్యుల కంట పడ్డారు.
ఘంటసాల గాత్రానికి సముద్రాల ఫిదా అయిపోయి సినీ పరిశ్రమలో అడుగు పెట్టాలని కోరారు.ఆపై బి.ఎన్.రెడ్డికి, చిత్తూరు నాగయ్యలకి ఘంటసాలను పరిచయం చేసి మూవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి మార్గం సుగమనం చేశారు.
కొద్ది రోజులకి ఘంటసాలకి ‘స్వర్గసీమ’ మూవీలో పాట పాడే అవకాశాన్ని బి.ఎన్.రెడ్డి కల్పించారు.అదే అతను పాడిన తొలి సినిమా పాట.ఈ పాట పాడినందుకు రూ.116 పారితోషికంగా పొందారు.దీని తర్వాత ‘రత్నమాల’ మూవీలోని కొన్ని పాటలను కంపోజ్ చేసి చాలామంది దృష్టిలో పడ్డారు అనంతరం ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు.

పాతాళభైరవి, మల్లీశ్వరి, అనార్కలి, మాయాబజార్, శ్రీ వెంకటేశ్వర మహత్యం, దేవదాసు, జయసింహం వంటి సినిమాల్లో మెలోడీ సాంగ్స్ అత్యంత మధురంగా పాడి ఘంటసాల ఎవరూ చేరుకోలేనంత ఎత్తుకు ఎదిగారు.30 ఏళ్ల పాటు ఏటా బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డును( Best Playback Singer Award ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పొందిన ఏకైక ఘనత ఘంటసాల మాత్రమే సాధించగలిగారు.ఘంటసాల చనిపోవడానికి ముందు భగవద్గీతను ఆలపించి ప్రజలను మరింత నేర్పించారు.
ఈయనకు మొత్తం 8 మంది సంతానం.వారిలో నలుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు ఉన్నారు.
ఘంటసాలకు ‘పద్మశ్రీ’ అవార్డు కూడా లభించింది.ఈ సింగర్ 1974లో చనిపోయారు.ఘంటసాల జ్ఞాపకార్థం 2003లో ఆయన ముఖచిత్రంతో ఒక స్టాంపును కూడా పోస్టల్ శాఖ రిలీజ్ చేసింది.2014లో అమెరికన్ పోస్టల్ డిపార్టుమెంటు సైతం ఘంటసాల పేరు మీద ఓ స్టాంపు ముద్రించింది.