గనిలో ఆట కాదు.. అంతకు మించి!- Ghani To Have Game Politics As Story

Ghani To Have Game Politics As Story, Ghani, Varun Tej, Kiran Korrapati, Tollywood News - Telugu Ghani, Kiran Korrapati, Tollywood News, Varun Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి ‘గని’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.పూర్తి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ బాక్సర్ ఆటగాడిగా కనిపిస్తాడు.

 Ghani To Have Game Politics As Story-TeluguStop.com

కిరణ్ కొర్రపాటి అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను ఇప్పటికే ప్రారంభించారు చిత్ర యూనిట్.కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.
ఇక ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.కాగా ఈ సినిమాలో కథ గురించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే అంతర్జాతీయ ఛాంపియన్‌గా తన సత్తా చాటేందుకు వరుణ్ తేజ్ ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొన్నాడు, క్రీడా రంగంలో నెలకొన్న రాజకీయాలను ఈ సినిమాలో మనకు చూపించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

 Ghani To Have Game Politics As Story-గనిలో ఆట కాదు.. అంతకు మించి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ సాయి మాంజ్రేకర్ నటిస్తుండగా, ఇతర పాత్రల్లో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టిలు నటిస్తున్నారు.మరి ఈ గని చిత్రం ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు అందరూ ఆగాల్సిందే.

కాగా ఈ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ ముగించి రిలీజ్‌కు రెడీ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
కాగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అటు బాక్సర్ పాత్రలో వరుణ్ తేజ్ పలికించే ఎమోషన్స్ ఓ రేంజ్‌లో ఉండబోతుండగా, స్పోర్ట్స్‌లో జరిగే పాలిటిక్స్‌లోనూ వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఏదేమైనా గని చిత్రంలో బాక్సింగ్ కంటే కూడా ఎమోషన్స్ ఓ రేంజ్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరి గని చిత్రంలో వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు ఆయన అభిమానులు.

#Kiran Korrapati #Varun Tej #Ghani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు