గని మూవీని పాన్ ఇండియాగా మార్చే ప్రయత్నం చేస్తున్న మేకర్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఎఫ్3 మూవీతో పటు బాక్సింగ్ నేపధ్యంలో గని మూవీ కూడా చేస్తున్నాడు.కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ నిర్మిస్తున్నాడు.

 Ghani Movie Turned As A Pan India Project, Varun Tej, Kiran Korrapati, Tollywood-TeluguStop.com

ఇక ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తూ ఉండగా బాలీవుడ్ భామ సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా సందడి చేయబోతుంది.ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే మెజారిటీ భాగం పూర్తయ్యింది.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఇక ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాల కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు.

వరుణ్ తేజ్ ని ఏకంగా ఇంటర్నేషనల్ బాక్సర్ గా తెరపై ప్రెజెంట్ చేయడానికి కంప్లీట్ మేకోవర్ కూడా మార్చేశారు.ఇదిలా ఉంటే ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది.

Telugu Ghani, Kiran Korrapati, Tollywood, Upendra, Varun Tej-Movie

గని మూవీని కేవలం తెలుగు బాషకి మాత్రమే పరిమితం చేయకుండా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.దీనికోసం అన్ని బాషలలో సినిమాని డబ్బింగ్ చేయాలని భావిస్తున్నారు.తెలుగు డబ్బింగ్ కోసం కోలీవుడ్ స్టార్స్ ఫాలో అయ్యే ఫార్ములాని అమలు చేస్తూ అన్ని సౌత్ బాషలతో పాటు హిందీలో కూడా గని మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.సినిమా అవుట్ పుట్ భాగా రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

దీనికి సంబందించిన క్లారిటీ త్వరలో వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.గని మూవీని పాన్ ఇండియా రేంజ్ లో ఆవిష్కరించడం ద్వారా సినిమాకి మరింత ఎక్కువ బిజినెస్ అవుతుందని, అలాగే వరుణ్ తేజ్ మార్కెట్ రేంజ్ కూడా పెరుగుతుందని అల్లు బాబీ భావిస్తున్నట్లు బోగట్టా.

అల్లు అరవింద్ ఇచ్చిన సలహాతోనే ఈ ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube