నిహారికకు నాకు నాన్న ఎప్పుడు చెప్పేవారు.. తొందరగా ఇంటికి రమ్మని.. కానీ మేమే: వరుణ్ తేజ్

టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గని నేడు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 8న విడుదల కాబోతోంది.

 Ghani Movie Hero Varun Tej About Ask Nagababu Fans Questions And Niharika, Varun-TeluguStop.com

ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆతృతగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లకు, టీజర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.సయీ మంజ్రేకర్ కు తెలుగులో ఇదే మొదటి సినిమా కావడం విశేషం.

ఇందులో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించి ప్రేక్షకులను అలరించబోతున్నారు.ఇకపోతే ఈ సినిమా అల్లు అరవింద్ సమర్పణలో రూపొందిన విషయం తెలిసిందే.తాజాగా జరిగిన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.

నిహారిక కు, నాకు నాన్నగారు ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటారు.అలా అడగవద్దు అని మేము చాలా సార్లు చెప్తూనే ఉంటాము.

కానీ ఇప్పటికీ నాన్నగారికి అలవాటు.షూటింగ్ లో ఉంటే ఫోన్ చేసి ఎక్కడ అని అడుగుతారు.

Telugu Ghani, Naga Babu, Niharika, Varun Tej-Movie

షూటింగ్ లో ఉన్నాము అని చెప్పగానే త్వరగా వచ్చేయండి అని అంటారు.మరి షూటింగ్ లో ఉంటే ఎలా వస్తాం.కానీ తండ్రిగా ఆయన అడుగుతూనే ఉంటారు అని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్.అనంతరం తన పెళ్లి గురించి మాట్లాడుతూ చాలామంది నా పెళ్లి గురించి మా నాన్నని అడిగారట కానీ పెళ్లి విషయంలో నిర్ణయం మా నాన్నకి వదిలేశారు అని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్.

హీరో అవకముందు నాన్న తో మాట్లాడడానికి ఏదైనా అడగడానికి చాలా భయపడేవాడిని, హీరో అయి నాలుగైదు సినిమాలు తీసిన తర్వాత కూడా భయపడేవాడిని.ఆ తర్వాత నిదానంగా నాన్న తో మాట్లాడటం మొదలు పెట్టాను.

ప్రస్తుతం మేము ఇద్దరం స్నేహితులం ఏ విషయం అయినా కూడా షేర్ చేసుకుంటాం అని తెలిపాడు వరుణ్ తేజ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube